AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter: చలికాలంలో ఫ్రిజ్ వాటర్ తాగితే జలుబు చేస్తుందా! వైద్యులు ఏం చెబుతున్నారు?

చలికాలం వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లలో ఫ్రిజ్ వాటర్ ఆగిపోతుంది. పొరపాటున ఎవరైనా చల్లని నీరు తాగితే, "చలికాలంలో చల్లని నీళ్లు తాగితే జలుబు చేస్తుంది" అని ఇంట్లోని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అసలు చలికాలంలో చల్లని నీరు తాగడానికి, జలుబు లేదా ఫ్లూ రావడానికి ..

Winter: చలికాలంలో ఫ్రిజ్ వాటర్ తాగితే జలుబు చేస్తుందా! వైద్యులు ఏం చెబుతున్నారు?
Cold Water.
Nikhil
|

Updated on: Dec 25, 2025 | 9:30 AM

Share

చలికాలం వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లలో ఫ్రిజ్ వాటర్ ఆగిపోతుంది. పొరపాటున ఎవరైనా చల్లని నీరు తాగితే, “చలికాలంలో చల్లని నీళ్లు తాగితే జలుబు చేస్తుంది” అని ఇంట్లోని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అసలు చలికాలంలో చల్లని నీరు తాగడానికి, జలుబు లేదా ఫ్లూ రావడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? వైద్య శాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? మనలో చాలా మందికి ఉన్న ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం..

జలుబుకు అసలు కారణం..

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జలుబు లేదా ఫ్లూ రావడానికి ప్రధాన కారణం వైరస్​లు. ఇవి గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్​లు ఇతరులకు సోకుతాయి. ఈ వైరస్​లు నీటిలో ఉండవు, కాబట్టి చల్లని నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాదు. నిజానికి, క్రీడాకారులు తమ శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎప్పుడూ చల్లని నీరే తాగుతుంటారు, వారికి దీని వల్ల జలుబు సోకడం లేదు కదా అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణంలో మార్పులే. ఈ సీజన్​లో గాలిలో తేమ తగ్గి పొడిబారుతుంది. దీనివల్ల వైరస్​లు ఎక్కువ కాలం జీవించడానికి, వేగంగా వ్యాపించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే, చలి నుంచి తప్పించుకోవడానికి అందరూ కిటికీలు, తలుపులు మూసేసి ఒకే చోట గుంపుగా ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి.

చల్లని నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాకపోయినా, కొన్ని సందర్భాల్లో ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. చల్లని నీరు తాగడం వల్ల ముక్కులోని శ్లేష్మం గట్టిపడి, గాలి పీల్చుకోవడంలో స్వల్ప ఇబ్బంది కలగవచ్చు. ఇప్పటికే జలుబు ఉన్నవారు చల్లని నీరు తాగితే, అది గొంతులోని రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి నొప్పిని లేదా అసౌకర్యాన్ని పెంచుతుంది. అతిగా చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి చల్లని నీరు తాగడం వల్లే జలుబు వస్తుందనేది ఒక అపోహ మాత్రమే. అయితే, వాతావరణం ఇప్పటికే చల్లగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి గోరువెచ్చని నీరు తాగడం మంచిది. జలుబు రాకుండా ఉండాలంటే తరచుగా చేతులు కడుక్కోవడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం మరియు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం.

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే