ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..వీడియో
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రకృతిలో మనకు సీజనల్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. ఆయా కాలాలను బట్టి మానవుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పండ్లు మనకు దొరుకుతాయి. కొన్ని రకాల పండ్లు చాలా రేర్‌గా దొరుకుతుంటాయి. అందుకే అవి ధర సామాన్యులకు అందనంతగా ఉంటుంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో పుచ్చకాయలు, తర్బూజా పండ్లు బాగా దొరుకుతాయి. వీటి ధరలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కానీ పుచ్చకాయల్లో అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి మీకు తెలుసా.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు. ఇది ఒక్క పండు ఖరీదు లక్షల్లో ఉంటుంది. అబ్బో.. అంత స్పెషలేంటో.. అనుకుంటున్నారా.. దాని ప్రత్యేకతేంటో ఇప్పుడు చూద్దాం.ఈ పండు జపాన్‌లో మాత్రమే దొరుకుతోంది. ఈ పుచ్చకాయను జపనీస్ పుచ్చకాయ లేదా, యుబారి కింగ్ పేరుతో పిలుస్తారు. ఈ ఖరీదైన పుచ్చకాయ హొక్కైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు. దీని ఖరీదు వేల డాలర్లలో ఉంటుంది. ఈ పండు ముఖ్యంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. తక్కువ గింజలు, ఘాటైన సువాసనతో నిండివుంటుంది. యుబారి కింగ్ పుచ్చకాయలు గుండ్రంగా, నునుపైన చర్మంతో ఉంటాయి. లోపల గుజ్జు నారింజ రంగులో ఉంటుంది. దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పండును చుగెన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు.ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ప్రతిరోజు ఈ పండును శుభ్రం చేస్తారు.ఈ పుచ్చకాయలు ఒకటిన్నరనుండి 2 కిలోల బరువు పెరుగుతాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఏప్రిల్ 1 నుంచి UPI పేమెంట్స్ బంద్ వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు