ఇక అక్కడ కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం..కానీ..
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి చైనాలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యంగా అన్ని రకాల జంతువులను చంపి తినడం ద్వారానే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని అనుమానం. అందులో గబ్బిలాల మాంసం ద్వారా ఈ కరోనా వ్యాపించిందని తొలుత కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ క్రమంలో కొద్ది రోజులుగా అక్కడ మాంసాహారం తినడంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల అక్కడ కరోనా వ్యాప్తి తగ్గిపోవడం.. దీంతో వూహాన్‌లో మార్కెట్లు తెరుచుకోవడంతో మళ్లీ అక్కడివారు మాంసాహారం […]

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి చైనాలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యంగా అన్ని రకాల జంతువులను చంపి తినడం ద్వారానే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని అనుమానం. అందులో గబ్బిలాల మాంసం ద్వారా ఈ కరోనా వ్యాపించిందని తొలుత కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ క్రమంలో కొద్ది రోజులుగా అక్కడ మాంసాహారం తినడంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల అక్కడ కరోనా వ్యాప్తి తగ్గిపోవడం.. దీంతో వూహాన్‌లో మార్కెట్లు తెరుచుకోవడంతో మళ్లీ అక్కడివారు మాంసాహారం కోసం ఎగబడుతున్నారు. అందులో కుక్క, పిల్లి మాంసంతో పాటు.. గబ్బిలాల మాంసం తినేందుకు కొట్టుకుచస్తున్నారట. ఈ నేపథ్యంలో అక్కడి షెన్‌జెన్ నగరం తొలిసారిగా కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమలులోనికి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇక కుక్కలు,పిల్లులతో పాటుగా పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులను తినడంపై నిషేధం విధించారు. అంతేకాదు.. వాటి పెంపకం, విక్రయం, వినియోగాన్ని ఈ షెన్‌జెన్ నగరంలో బ్యాన్ చేశారు. ఇదిలావుంటే.. ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్దలపై ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు.
కాగా.. ఇక ఇప్పటికే అక్కడి తైవాన్, హాంకాంగ్ దేశాల్లో కూడా కుక్కలు, పిల్లులను తినడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.