Hyderabad: రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట.. సీన్ కట్ చేస్తే.!
బట్టతల బాధితులు మీకో గుడ్ న్యూస్ చెప్పాడు ఈ సెలూన్ షాప్ యజమాని. కేవలం రూ. 200కే బట్టతలకు మందు ఇస్తాడట. ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా..

ఇప్పుడున్న కాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి బట్టతల. చెప్పుకోవడానికి మొహమాటంగా అనిపించినా ఈ సమస్యతో ఎంతో మంది యువకులు ప్రస్తుతం ఇబ్బందుల పాలవుతున్నారని ఒప్పుకోవాల్సిన విషయమే. కొందరికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం ఈ మధ్యకాలంలో సాధారణంగా కనిపిస్తూనే ఉంది. వాతావరణ పరిస్థితులు కావొచ్చు.. రసాయనాలు ఉపయోగించి తయారయ్యే షాంపూలు వాడడం వల్ల అయ్యి ఉండొచ్చు.. తాగే నీటి వల్ల కావొచ్చు.. సమస్య మాత్రం దేశంలో అధిక శాతంలోనే ఉంది. ఈ బట్టతలతో నలుగురిలోకి వెళ్లాలన్నా, పెళ్లి విషయంలో అయినా చాలా మంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే.. ఇప్పుడు ఇదే అసహాయతను అవకాశంగా మలుచుకుని ఓ సెలూన్ షాప్ ఓనర్ జనాల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఇంకేముంది.. రాత్రికి రాత్రే పెద్దఎత్తున యువకులను తన షాపు ముందు క్యూలు కట్టేలా చేసుకున్నాడు. ఇంతకీ ఆ బట్టతల సంగతేంటో.. ఆ సెలూన్ షాప్ వ్యవహారమేంటో చూసొద్దాం రండి.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని ఓ సెలూన్ షాప్ ముందు వందల కొద్దీ జనం క్యూలు కడుతున్నారు.. ముఖ్యంగా అందులో యువత. ఆ షాపులోకి వెళ్లి ఆ ఓనర్ చేత తమ సమస్యకు పరిష్కారం వెతుక్కోవడానికి ఎగబడుతున్నారు. అక్కడే నాలుగైదు గంటలు ఎదురుచూసైనా సరే తమ బట్టతలకి ముందు రాయించుకుంటున్నారు. బట్టతల అంటే కేవలం పిల్లలు, యువకుల వరకే కాదు.. ముసలోళ్లు సైతం క్యూ కట్టి ఓపిక లేకపోయినా పడిగాపులు కాస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. ఆ షాపులో ఓనర్ బట్టతలను మాయం చేసి జుట్టు తెప్పిస్తాడట. అది కూడా కేవలం రూ.200కే. తాను తయారుచేసిన ఓ మందుని బట్టతల ఉన్నవారికి రుద్ది ఎనిమిది అంటే ఎనిమిది రోజుల్లోనే బట్టతలను పూర్తిగా మాయం చేసి తలపై వెంట్రుకలు వస్తాయని చెబుతున్నాడు. ఇంకేముంది.. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అతని షాపు ముందు వాలిపోయారు. ఎంత మంది జనం ఉన్నా క్యూలు కట్టి ఎదురుచూస్తున్నారు. ఎంత సేపు టైం పట్టినా ఓపికగా వేచి ఉండి మరీ తమకు లేని జుట్టు కోసం అగచాట్లు పడుతున్నారు. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్.. ఆ షాపు ఓనర్ తలకి రుద్దుతున్న మందు మాత్రం ఫ్రీ అంట.. ఈ విషయం పాతబస్తీ అంతా పెద్దఎత్తున ప్రచారం జరగడంతో రాత్రనక, పగలనక జనాలు పడిగాపులు కాస్తూ ఆ సెలూన్ ఓనర్ దగ్గర మందు రాయించుకుంటున్నారు.
ఆ సెలూన్ షాప్ ఓనర్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. పాతబస్తీలోనే ఉంటూ ఈ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడేమో ఇలా కేవలం 200 రూపాయలకే బట్టతల అంటూ ప్రచారం చేసి జనాలను షాపుకు రప్పించుకుని ఫేమస్ అయిపోయాడు. ఇదంతా ఇలా ఉండగా.. ఇది ఎంతవరకు నిజం అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. పైగా బట్టతల మీద ఫ్రీగానే మందు రాస్తున్నాడు కాబట్టి, జనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. అందుకే ఇలా ఎగబడుతున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే ఇలా మందు రాయించుకుని జుట్టు వచ్చిందని ఫలితం చూపించినవాళ్లు మాత్రం ఇంకా బయటికి రాలేదు. లేదా ఈ వ్యవహారం ఈ మధ్యే మొదలుపెట్టినట్లయితే కొన్ని రోజులు వరకు చూసి నిజానిజాలేంటో తెలుసుకోవాలి. అదంతా కాదని, జనాలకు మాయమాటలు చెప్పి ఇలా ఆ ఓనర్ షాపుకి రప్పించుకున్నాడు, అలా అయినా తన షాపు పది మందికి తెలిసి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నాడని కూడా అంటున్న వాళ్లు కూడా లేకపోలేదు. జుట్టు సంగతి దేవుడెరుగు.. ఆ మందు రాయించుకోవడం వల్ల తర్వాత ఏ సమస్యలు రాకుండా ఉంటే చాలు.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా