- Telugu News Photo Gallery SPMCIL Donates Mobile Dental Van to Rohini Foundation for Rural Telangana Healthcare
రోహిని ఫౌండేషన్‌కు మొబైల్ డెంటల్ వ్యాన్ డొనేట్ చేసిన SPMCIL
గ్రామీణ తెలంగాణలో దంత సంరక్షణను మెరుగుపరచడానికి, SPMCIL (సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) రోహిణి ఫౌండేషన్‌కు ఒక అత్యాధునిక మొబైల్ డెంటల్ వ్యాన్‌ను విరాళంగా ఇచ్చింది. ఈ వ్యాన్ పేద ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు ఉచిత దంత పరీక్షలు, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్‌లు అందిస్తుంది.
Updated on: Mar 28, 2025 | 2:30 PM

గ్రామీణ తెలంగాణలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి SPMCIL (సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) రోహిణి ఫౌండేషన్‌కు మొబైల్ డెంటల్ వ్యాన్‌ను విరాళంగా అందించింది.

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా రోహిణి ఫౌండేషన్‌కు మొబైల్ డెంటల్ వ్యాన్‌ను సమకూర్చింది.

ఈ వ్యాన్‌ను SPMCIL చైర్మన్ అండ్ CMD విజయ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. శ్రీపాద వాజ్‌పే (చీఫ్ జనరల్ మేనేజర్), దుర్గా ప్రసాద్ ఆచంట(AGM), మెహుల్ రాథోడ్ (DGM), రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంపత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైఫాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేద వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలోని పిల్లలకు ఉచిత దంత పరీక్షలు, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్‌లు నివారణ సంరక్షణను అందించడానికి ఈ అత్యాధునిక మొబైల్ డెంటల్ యూనిట్ రోహిణి ఫౌండేషన్‌కు ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ వ్యాన్ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, చాలా అవసరమైన దంత సంరక్షణను అందించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు.
