Hyderabad: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ పరిధిలో ఓ ఇద్దరు వ్యక్తులు సంచరిస్తూ కనిపించారు. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది వారి ప్రవర్తన. ఈలోపు అక్కడికి కాలేజీ స్టూడెంట్స్ కొందరు వచ్చారు. వారికి ఏవో ప్యాకెట్లు ఇచ్చారు. ఇక ఇదంతా పోలీసులకు సమాచారం అందించగా..

ఆశకు, అత్యాశకు చాలా తేడా ఉంది. ఆశ ఒక మనిషిని బ్రతికించేంత బలాన్ని ఇస్తే.. అత్యాశ ఓ మనిషిని తప్పుడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అత్యాశ, భయం.. ఇవి రెండే మనిషి పతనానికి మూలకారణం. చక్కగా తమకొచ్చిన ఉద్యోగాన్ని చేసుకోవడం, నెలాఖరున వచ్చే జీతంతో ఖర్చులు పోగా.. మిగిలిన డబ్బుతో హ్యాపీగా సినిమాలకు వెళ్లామా.. ఫ్రెండ్స్‌తో తిరిగామా.. లాంటి పనులు చేయాల్సిన కొందరు.. తప్పుడు దారిని ఎంచుకుంటున్నారు. వచ్చిన జీతం చాలట్లేదో.. లేక సైడ్ ఇన్‌కమ్ కోసం.. లేదా ఈజీ మనీ కోసమో దిక్కుమాలిన దందాకు తెర తీశారు. అది మంచిదైతే అందరూ మెచ్చుకునేవారు.. కానీ కాదుగా.. అందుకే హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి కటకటాల్లో పడేశారు.
ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్ సిటీలో జగన్మోహన్, అరుణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు నడ్డిరోడ్డుపై గంజాయిని యదేచ్చగా అమ్మకం సాగించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు.. గంజాయి అమ్ముతుండగా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి 1.3 కేజీల డ్రై గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చి.. ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
కాగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపడమే కాదు.. కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు యదేచ్చగా తమ దందాను సాగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్ధాలను స్టేట్ బోర్డర్లు దాటిస్తున్నారు. కాలేజీ విద్యార్ధులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి, మత్తు పదార్ధాలను అమ్ముతున్నారు. యువతను మత్తులో చిత్తు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి