AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏకంగా పోలీస్‌పైనే బీర్ బాటిల్‌తో దాడి.. ఎస్కేప్ అయ్యే సీన్.. ఇంతలో ట్వి్స్ట్!

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు ఓ యువకుడు. టోలిచౌకీ నుంచి ఎక్కువ వేగంతో బైక్ నడుపుకుంటూ వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్, ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఒక కారు‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కార్ డ్రైవర్, ఖాజా అనే వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Hyderabad: ఏకంగా పోలీస్‌పైనే బీర్ బాటిల్‌తో దాడి.. ఎస్కేప్ అయ్యే సీన్.. ఇంతలో ట్వి్స్ట్!
Bike Racer Attacked Police
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Mar 25, 2025 | 3:31 PM

Share

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు ఓ యువకుడు. టోలిచౌకీ నుంచి ఎక్కువ వేగంతో బైక్ నడుపుకుంటూ వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్, ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఒక కారు‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కార్ డ్రైవర్, ఖాజా అనే వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవ పెట్టుకున్నారు. అదే సమయంలో ఆ రూట్‌లో డ్యూటీ నిమిత్తం వెళ్తున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఘటనను గమనించి ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కాని ఖాజా తన తప్పని ఒప్పుకోకుండా మరింత దూకుడుగా వ్యవహరించాడు. శ్రీకాంత్ వారించేందుకు వచ్చాడని గమనించిన ఖాజా, పక్కనే ఉన్న బీర్ బాటిల్‌ను తీసుకుని కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దాడి చేసి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. రెండు కిలోమీటర్ల పాటు అతన్ని చేజ్ చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఎట్టకేలకు ఖాజాను అదుపులోకి తీసుకున్నాడు.

దాడి అనంతరం బంజారాహిల్స్ పోలీసులు తక్షణమే స్పందించి ఖాజాపై చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ గాయపడడంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఖాజా దూకుడుగా వ్యవహరించడంతో పాటు, మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. గాయపడిన కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్లో కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ తోపాటు ఆ కారు నడిపిన డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు బైక్ రేసర్ ఖాజాపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బైక్ రేసర్ ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?