Telangana: పైకి చూసి సాదాసీదా పిక్ పాకెటర్ అనుకునేరు.. అసలు స్టోరీ తెలిస్తే కళ్లు తేలేస్తారు
చుట్టూ పోలీసులను చూసి పెద్ద బొమ్మ అనుకునేరు. అలా అని వీడు సాదాసీదా పిక్ పాకెటర్ కూడా కాదు.. అసలు వీడు చేసిన పని ఏంటో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

బుద్ది మంచిది కాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వీడు ప్రియురాలి ఫ్రెండ్ ఇంట్లోనే చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ప్రేయసితో ఉన్న సమయంలో.. ఆమె ఫోన్‌లో స్నేహితురాలితో మాట్లాడుతుండగా సైలెంట్‌గా విని.. ఆమె వద్ద గోల్డ్, సిల్వర్ ఉన్నాయని తెలుసుకుని తన చోరకళను ప్రదర్శించాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడు పాత నేరస్థుడని, పలుమార్లు జైలుకు వెళ్లినా తీరు మార్చుకోలేదని గుర్తించారు.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్కాకతీయ హిల్స్‌కి చెందిన పేర్ని నిరీష ఈవెంట్మేనేజర్గా పని చేస్తుంది. మార్చి 21న సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లోని రిలేటివ్స్ ఇంటికి వెళ్లారు. మళ్లీ 23న ఇంటికి రాగా.. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు కన్పించలేదు. ఇంటి CC ఫుటేజ్ చెక్ చేయగా.. కూకట్‌పల్లి తులసీనగర్‌కి చెందిన నాసర్అలియాస్నసిరుద్దీన్ లోపలికి ప్రవేశించినట్లుగా గుర్తించారు. నిరీష ఫ్రెండ్, మరో ఈవెంట్మేనేజర్శోభారాణితో నసీర్ ప్రేమలో ఉన్నాడు. నిరీషతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా విని నిందితుడు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా