Garlic 3

వేసవిలో వెల్లుల్లి తినొచ్చా..?

28 March 2025

image

TV9 Telugu

ఉల్లిలాగే.. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం దాకా.. వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు

వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం

TV9 Telugu

వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం

వెల్లుల్లిని సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనిని అన్ని రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు

వెల్లుల్లిలో విటమిన్ ఎ, సి, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ప్రోటీన్, ఇనుము, కొవ్వు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా వేడి స్వభావం కలిగిన వెల్లుల్లిని వేసవిలో తినొచ్చో? లేదో? అని చాలా మంది సందేహిస్తుంటారు

TV9 Telugu

వేసవిలో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తినవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంత కంటే ఎక్కువ పరిమాణంలో తినడం హానికరమట

TV9 Telugu

వెల్లుల్లి తింటే గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

ప్రతిరోజూ వెల్లుల్లి తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.  వెల్లుల్లి కడుపు సంబంధిత సమస్యలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

TV9 Telugu

వెల్లుల్లి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. అజీర్ణ లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే వేసవిలో ఎల్లప్పుడూ మితంగానే దీనిని తీసుకోవాలి