మ్యాజిక్ డ్రింక్.. రాత్రిపూట తాగితే అమేజింగ్ అంతే.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్..
పాలు, నెయ్యి మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలో పోషకాల శోషణ పెరుగుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, ఇది ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్లు అన్నీ మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఎముకల ఆరోగ్యం నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు ప్రతిదీ మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అలాగే.. పాల నుంచి తీసిన నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలతోపాటు ఔషధగుణాలు దాగున్నాయి.. అయితే.. ఒక గ్లాసు వేడి పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ కాంబినేషన్ కొంచెం వింతగా అనిపించినా, నెయ్యి – పాలు కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు.
పాలు, నెయ్యి మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలో పోషకాల శోషణ పెరుగుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, ఇది ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్లు అన్నీ మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఎముకల ఆరోగ్యం నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు ప్రతిదీ మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పాలలో నెయ్యి కలుపుకోని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
- కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA)కి నెయ్యి మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇంకా జీవక్రియను పెంచుతుంది. దీంతో పొట్ట సమస్యలు దూరమవుతాయి..
- పాలు కాల్షియానికి మంచి మూలం. బలమైన ఎముకలు, దంతాలకు ఇది అవసరం. కాబట్టి పాలలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల నెయ్యిలోని విటమిన్ కె2 శరీరం కాల్షియంను గ్రహించేలా చేస్తుంది.
- నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, పాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
- ట్రిప్టోఫాన్‌కు నెయ్యి మంచి మూలం. ఇది నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడే అమైనో ఆమ్లం. పాలలో మెలటోనిన్ కూడా ఉంటుంది.. ఇది నిద్రను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- పాలు విటమిన్లు – ఖనిజాలకు మంచి మూలం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
- పాలు ప్రోటీన్ కు మంచి మూలం.. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు అవసరం. మరోవైపు నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మం, జుట్టును మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది.
వేడి పాలలో నెయ్యి కలిపి రాత్రిపూట తాగితే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. ముందుగా పాలు వేడి చేసి దానిలో కొంచెం నెయ్యి కలుపుకోవాలి.. గోరువెచ్చగా అయిన తర్వాత.. తాగండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..