ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
బీరకాయను అందరూ ఇష్టపడరు. కానీ బీరకాయలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. బీరకాయను కొందరు కూర, చట్నీతోపాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఇతర కూరగాయలతో పోలిస్తే.. బీరకాయ మృదువుగా, సులభంగా ఉడుకుతుంది. కాబట్టి, దీన్ని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. ఇతర కూరలతో కలిపి కూడా దీనిని వండవచ్చు..తినవచ్చు. ఎన్నో పోషకాలున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో.. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. బీరకాయలో సి, ఎ, కె విటమిన్లతోపాటు ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
ఈ అంశాలన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే బీరకాయను తరచూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శక్తికి మూలంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునేవారికి బీరకాయ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు బీరకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బీరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీరకాయల్లో ప్రేగులను శుభ్రంగా- ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు, గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉంటాయి. ఇది కడుపును శుభ్రపరచడం, కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఏప్రిల్ 1 నుంచి UPI పేమెంట్స్ బంద్ వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు