AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు.. ఆదాయపు పన్ను నోటీసులకు చెక్ పెట్టండిలా..!

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పౌరులు తమ ఆదాయానికి అనుగుణంగా వివిధ శ్లాబ్స్ ఆధారంగా పన్ను చెల్లిస్తారు. అయితే పన్ను చెల్లింపుల్లో చేసే చిన్న తప్పుల వల్ల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. ఆదాయపుపన్ను నోటీసులకు పెట్టుబడి చిట్కాలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రాకుండా తీసుకోవాల్సిన పెట్టుబడి చిట్కాలను తెలుసుకుందాం.

Income Tax: పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు.. ఆదాయపు పన్ను నోటీసులకు చెక్ పెట్టండిలా..!
Income Tax
Nikhil
|

Updated on: Mar 28, 2025 | 12:30 PM

Share

ఆదాయపు పన్ను ఆదా చేసుకునే ప్రయత్నంలో మన దేశంలో చాలా మంది వ్యక్తులు తరచుగా తప్పులు చేస్తారు. దీని వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేరుగా మన ఇంటికి నోటీసులు పంపే అవకాశం ఉంది. అన్ని ఆదాయపు పన్ను నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటించడం చాలా ముఖ్యంమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయాలను వృత్తిపరమైన మార్గదర్శకత్వం లేకుండా నిర్వహించకూడదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను నోటీసులు రాకుండా ఏయే పథకాల్లో పెట్టుబడి పెట్టాలో? చూద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికగా ఉంటుంది. ఇవి కాలపరిమితి చివరిలో హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అయితే ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వారికి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు అందవచ్చు.

పొదుపు ఖాతా లావాదేవీలు

పొదుపు ఖాతాలో లావాదేవీలు నిర్వహించడం సర్వసాధారణం. చాలా మంది మల్టీ అకౌంట్స్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఖాతాలను నిర్వహించడానికి నియమాలు ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలోపు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. 

ఇవి కూడా చదవండి

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారింది. తక్కువ వ్యవధిలో గణనీయమైన రాబడిని ఇస్తుంది. అయితే రియల్ ఎస్టేట్‌లో రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు.

మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఇటీవల కాలంలో చాలా మంది పెరిగారు. ఇందులో పెట్టుబడి దీర్ఘకాలిక రాబడికి సురక్షితమైన ఎంపికగా భావిస్తారు. బాండ్లు, డిబెంచర్లు కూడా అదేవిధంగా కనిపిస్తాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు.

విదేశీ ఆస్తులు

విదేశీ కరెన్సీ కొనుగోలుపై పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను మించి ట్రావెలర్స్ చెక్కులు, విదేశీ కరెన్సీ కార్డులు లేదా డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వచ్చే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు మరియు జరిమానాలను నివారించడానికి ఈ ఐదు లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం