Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Bill 2025: అమ్మో ఏప్రిల్ 1 వచ్చేస్తోంది.. ఇకపై వాట్సప్ సహా సోషల్ మీడియా ఖాతాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే..!

కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 27) వివరించారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు, ప్రభుత్వం లెక్కల్లో చూపని డబ్బు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతోపాటు.. అక్రమార్కులకు అడ్డుకట్టవేయనుందని తెలిపారు.

Income Tax Bill 2025: అమ్మో ఏప్రిల్ 1 వచ్చేస్తోంది.. ఇకపై వాట్సప్ సహా సోషల్ మీడియా ఖాతాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే..!
Income Tax Bill 2025
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2025 | 11:26 AM

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు.. ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.. అయితే.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 27) వివరించారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు, ప్రభుత్వం లెక్కల్లో చూపని డబ్బు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇది చాలావరకు అసలు నిబంధనలకు అనుగుణంగా.. భాషను సరళీకృతం చేయడం, అనవసరమైన విభాగాలను తొలగించడం దీని లక్ష్యం.. అక్రమార్కులను పట్టుకోవటానికి మరిన్ని డిజిటల్ ఆధారాల అన్వేషణకు ఇది మార్గం సుగమం చేయనుందని పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతోపాటు.. అక్రమార్కులకు అడ్డుకట్టవేయనుంది.

కొత్త బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలును తాజాగా ఉంచడంలో సహాయపడుతుందని, క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ అన్నారు. డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలు అధికారులకు కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఆధారాలను అందిస్తాయి. లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

“మొబైల్ ఫోన్లలో గుప్తీకరించిన సందేశాల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బు బయటపడింది. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల నుంచి ఆధారాలు కనుగొన్నాం. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా లెక్కల్లో లేని రూ.200 కోట్ల డబ్బు బయటపడింది” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

గూగుల్ మ్యాప్స్ హిస్టరీ నగదు దాచడానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడిందని సీతారామన్ హైలైట్ చేశారు. ‘బినామీ’ ఆస్తి యాజమాన్యాన్ని నిర్ణయించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించామని ఆమె తెలిపారు.

కొత్త బిల్లు కింద అధికారులు ఏయే ఖాతాలు యాక్సెస్ చేయవచ్చు?

కొత్త బిల్లు అధికారులకు వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేసే హక్కును కల్పిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. అదనంగా, ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్‌వేర్, సర్వర్‌లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేయగలదు.

ఈ బిల్లు వెల్లడించని ఆదాయం విషయంలో.. వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్‌లు, క్రిప్టోకరెన్సీలు, క్రిప్టోగ్రాఫిక్ వంటివి ఉంటాయి.

ఇది శోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిని ఇస్తుంది. ఇది ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్‌లను ఓవర్‌రైడ్ చేసే అధికారాన్ని కూడా ఇది అధికారులకు ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..