AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Schemes: ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ స్కీమ్స్‌లో పెట్టుబడికి మూడు రోజులే గడువు

భారతదేశంలోని ప్రజలకు ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తున్నాయి. పెట్టుబడికి భరోసాతో రాబడికి మంచి హామీ ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే బ్యాంకులు ఇటీవల కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్కీమ్స్ ప్రవేశపెట్టి అదిరిపోయే వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఏయే ఏయే ప్రత్యేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయో? ఓసారి చూద్దాం.

FD Schemes: ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ స్కీమ్స్‌లో పెట్టుబడికి మూడు రోజులే గడువు
ఎఫ్డీ వడ్డీ రేట్లలో మార్పు: జూన్ 1న FD వడ్డీ రేట్లను కూడా తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. చాలా బ్యాంకులు 6.5% నుండి 7.5% మధ్య వడ్డీ ఇస్తున్నప్పటికీ, జూన్ నుండి ఈ రేట్లు కూడా తగ్గవచ్చని భావిస్తున్నారు.
Nikhil
|

Updated on: Mar 28, 2025 | 12:13 PM

Share

దేశంలో చాలా బ్యాంకులు ఇప్పుడు సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వరకు వడ్డీ రేట్లతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. ఈ పరిమిత కాల ఎఫ్‌డీలు సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొదుపును పెంచుకోవాలనుకునే పెట్టుబడిదారులకు అద్భుతమైన ఎంపికగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు పోటీ వడ్డీ రేట్లతో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్‌ను ప్రారంభించాయి. ఈ పథకాలు సాధారణ పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లతో సహా వివిధ వర్గాల పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి. అయితే ఈ పథకాల వడ్డీ రేట్లు కాలపరిమితితో పాటు పెట్టుబడిదారుడి క్లాసిఫికేషన్ ఆధారంగా మారుతూ ఉంటాయి.

ఎస్‌బీఐ అమృత్ వృష్టి

ఎస్‌బీఐకు సంబంధించిన అమృత్ వృష్టి సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటుతో 444 రోజుల ప్రత్యేక కాలపరిమితితో వస్తుంది. ఈ పథకం మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ అమృత్ కలాష్ పథకం 400 రోజుల కాలపరిమితిని కలిగి ఉంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటుతో వస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు చెల్లుతుంది.

ఐడీబీఐ ఉత్సవ్ 

ఐడీబీఐ బ్యాంక్‌నకు ఉత్సవ్ పేరుతో లాంచ్ చేసిన ఎఫ్‌డీ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి ఆధారంగా మారుతూ ఉండే వడ్డీ రేట్లతో వస్తుంది. పెట్టుబడిదారులు ఈ పథకాన్ని మార్చి 31, 2025 వరకు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇండియన్ బ్యాంక్ 

ఇండియన్ బ్యాంక్ ఐఎన్‌డీ సుప్రీం, ఐఎన్‌డీ సూపర్ ఎఫ్‌డీలను అందిస్తుంది. ఇండియన్ బ్యాంక్ ఐఎన్‌డీ సుప్రీం 300 రోజులు, ఐఎన్‌డీ సూపర్ 400 రోజుల వ్యవధితో ఎఫ్‌డీ పథకాలను లాంచ్ చేసింది. ఈ పథకాల్లో సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2025గా ఉంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎడిషన్ ఎఫ్‌డీ 35 నెలల కాలపరిమితికి అధిక వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పెట్టుబడిదారులు వార్షిక వడ్డీ రేటు 7.35 శాతం పొందుతారు. సీనియర్ సిటిజన్లు 7.85 శాతం అంటే 0.50 శాతం ఎక్కువ రేటు పొందుతారు. ఈ పథకం మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

పంజాబ్ & సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ

పంజాబ్ & సింధ్ బ్యాంక్ వివిధ కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. 333 రోజుల కాలపరిమితికి 7.20 శాతం, 444 రోజులకు  7.30 శాతం, 555 రోజులకు 7.45 శాతం, 777 రోజులకు 7.20 శాతం, 999 రోజులకు 6.65 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..