విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం
విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఏపీఎస్‌పీడీసీఎల్ సంస్థ మార్చి నెల విద్యుత్ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఏపీఎస్‌పీడీసీఎల్ సంస్థ మార్చి నెల విద్యుత్ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్ బిల్లుకూ వర్తింప జేయాలని నిర్ణయించింది. అలాగే విద్యుత్ బిల్లులను కూడా వినియోగదారుల ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా పంపనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 18 వరకు అపరాథ రుసుము లేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటించింది. ఈ మార్పును 8 జిల్లాల ప్రజలు గమనించాలని ఏపీ విద్యుత్ సంస్థ సీఎండీ హరనాథరావు తెలిపారు. ఇప్పటికే అనేక సంస్థలు.. బిల్లుల చెల్లింపు విషయంలో ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో ఏపీఎస్‌పీడీసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే
లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం
కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..
అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం