ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు..రెడ్‌జోన్‌గా మంగళగిరి
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 132కి చేరాయి. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం సంచలనం రేపుతోంది..

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132కు చేరాయి. రాష్ట్రంలో బుధవారం (01-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి గురువారం (02.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 21 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 132కి చేరాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం సంచలనం రేపుతోంది. దీంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్ ఏరియాలు ప్రకటించారు.
కోరలు చాస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గత అర్ధరాత్రి 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అతడు కూడా మర్కజ్ మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3కి.మీల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. సమీపంలోని దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. ఆ ప్రాంతమంతా 144 సెక్షన్ నింబంధనలు విధించిన పోలీసులు స్థానికులను బయటకు రానివ్వలేదు. ఆ ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు.