అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు..ఏప్రిల్ 19వరకు ఆంక్షలు
దాదాపు 200లకు పైగా దేశాలకు విస్తరించిన ఈ కోవిడ్ భూతం.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. వైరస్ విస్తృతి నేపథ్యంలో ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోరలు చాచిన వైరస్ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. దాదాపు 200లకు పైగా దేశాలకు విస్తరించిన ఈ కోవిడ్ భూతం.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. వైరస్ విస్తృతి నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ జర్మనీ అతలాకుతలం చేస్తోంది. జర్మనీపై కరోనా0 తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూండటంతో.. అక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. కరోనా ఒత్తిడి కారణంగా అక్కడ ఓ రాష్ట్రానికి ఆర్థిక మంత్రే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జర్మనీలోని హెస్సీ రాష్ట్రం ఆర్థికంగా ఆ దేశంలోనే కీలకమైన రాష్ట్. ఫ్రాంక్ ఫర్ట్ ..ఈ రాష్ట్రంలోని నగరమే. ప్రఖ్యాత వ్యాపార సంస్థల హెడ్ క్వార్టర్లు ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్నాయి. ఆర్థిక సేవల రాజధానిగా ఫ్రాంక్ ఫర్ట్‌కు పేరు ఉంది. ప్రపంచంలో ప్రముఖ బ్యాంక్‌గా పేరున్న డచ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. హెస్సీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ధామస్ పదేళ్లుగా వ్యవహరిస్తున్నారు. సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం.. ఆయనకు అర్థం కాలేదు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
దేశంలో కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. జర్మనీ వ్యాప్తంగా కరోనా కేసులు 77,981 నమోదయ్యాయి. కాగా, 931 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు. 18,700 మంది కొలుకున్నారు. ఇంకా.58,350 మంది కరోనా వైరస్ బాధితులుగా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లుగా జర్మనీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కలు. ఈ క్రమంలోనే జర్మన్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించింది. ఏప్రిల్ 19వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లుగా జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది.