CSK vs RCB: హాఫ్ సెంచరీతో ఒకరు.. 275 స్ట్రైక్ రేట్‌తో మరొకరు.. చెన్నైపై ఆర్‌సీబీ బ్యాటర్ల ఊచకోత
Chennai Super Kings vs Royal Challengers Bengaluru, 8th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 8వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగుల టార్గెట్ అందించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కెప్టెన్ పాటిదార్ 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31, పడిక్కల్ 27 మాత్రమే ఓ మోస్తారుగా బ్యాట్ ఝులిపించగా.. మిగతా వాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్కోరును 200 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లాడు.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2 వికెట్లు పడగొట్టగా, ఖలీల్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇరు జట్ల ప్లేయింగ్-11..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: సుయాష్ శర్మ, రసిక్ సలాం, మనోజ్ భండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్) , రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతిషా పతిరానా మరియు ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: శివం దుబే, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జిమ్మీ ఓవర్టన్, షేక్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..