Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : ఉగాది రోజున ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో చిత్రాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ కెరీర్‏లో మైలురాయిగా నిలిచిపోయిన ఆదిత్య 369 సైతం మళ్లీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిత్య 369 సినిమా రీరిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు.

Balakrishna : ఉగాది రోజున ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..
Aditya 369 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2025 | 9:31 PM

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్.

ఈ సందర్బంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన “ఆదిత్య 369” చిత్రాన్ని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ కల్డ్ క్లాసిక్ సినిమా ఆదిత్య 369. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శక్తవం వహించగా.. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జానర్ లో ఈ మూవీని రూపొందించారు. ఇందులో మోహిని హీరోయిన్ గా నటించగా.. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 1991లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..