వద్దని చెబుతున్నా రోడ్లపైకి వాహనాలు..2ల‌క్ష‌లు దాటిన‌..

వాహనదారులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం కచ్చితంగా చెబుతోంది. అయినా కానీ, లాక్‌డౌన్‌ సమయంలో తమనెవరూ పట్టించుకోలేరనే ఉద్దేశంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ట్రై కమిషనరేట్‌ల పరిధిలో

వద్దని చెబుతున్నా రోడ్లపైకి వాహనాలు..2ల‌క్ష‌లు దాటిన‌..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 1:19 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.. వాహనదారులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం కచ్చితంగా చెబుతోంది. అయినా కానీ,  లాక్‌డౌన్‌ సమయంలో తమనెవరూ పట్టించుకోలేరనే ఉద్దేశంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ట్రై కమిషనరేట్‌ల పరిధిలో మార్చి 22 నుంచి 29 వరకు మొత్తం 2,02,445 కేసులు నమోదయ్యాయి.1700 వాహనాలు సీజ్‌ చేశారు.
ఇవి కాకుండా.. హైదరాబాద్‌ పరిధిలో మార్చి 30 సాయంత్రం వ‌ర‌కు 11527 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో ద్విచక్రవాహనం మీద ఒక్కరు, కారులో అయితే ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరం పరిశీలిస్తుంటారు. నగరంలో సీసీ కెమెరాలకు తోడుగా ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ సిస్టమ్‌ కూడా కేసుల నమోదులో సాక్ష్యా లు నమోదు చేసి చలాన్లు విధిస్తున్నాయి.
మొత్తం కేసులు 202445 ట్రై కమిషనరేట్ల పరిధిలో మార్చి 22 నుంచి 29 వరకు నమోదు చేసిన ఉల్లంఘనల వివరాలు. హైదరాబాద్‌ : 59845 సైబరాబాద్‌ : 1,22,064 రాచకొండ : 20536
బయటకు వస్తే బండి సీజ్‌ : – హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే వారి వాహనాలు సీజ్‌ చేస్తాం. హైదరాబాద్‌లో 12 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిని దవాఖానలో ఉన్న క్వారైంటన్‌లోకి పంపిస్తాం. నగరంలో నిత్యావసర వస్తువుల సరఫరా సాఫీగా సాగుతున్నది. అవసరమైన వారు ఆన్‌లైన్‌లో పాసుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ రాచకొండ కమిషనరేట్‌కు ఆనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన చెక్‌పోస్టులను సీపీ మహేశ్‌ భగవత్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ చౌటుప్పల్‌ పతంగి టోల్‌గేట్‌ వద్ద ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారితో ఆయన మాట్లాడారు.