Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చిపోతున్న తబ్లిఘి వర్కర్స్.. నర్సింగ్ స్టాఫ్ ముందు అర్దనగ్నంగా…

తబ్లిఘి జమాత్ సభ్యుల ఆగడాలుకు హద్దు లేకుండా పోతోంది. మొన్నబుధవారం ఢిల్లీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సిబ్బందిపై ఉమ్ముతూ.. తాము కోరిన ఆహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ.. వైద్య సిబ్బందిపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే.. తాజాగా గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కూడా వీరు రెచ్చిపోయారు. వైద్య సిబ్బంది, నర్స్‌ల ముందు అర్ధనగ్నంగా తిరుగుతూ.. అసభ్యకరమైనా పాటలు పాడుతూ.. మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. గతనెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన […]

రెచ్చిపోతున్న తబ్లిఘి వర్కర్స్.. నర్సింగ్ స్టాఫ్ ముందు అర్దనగ్నంగా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 2:20 PM

తబ్లిఘి జమాత్ సభ్యుల ఆగడాలుకు హద్దు లేకుండా పోతోంది. మొన్నబుధవారం ఢిల్లీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సిబ్బందిపై ఉమ్ముతూ.. తాము కోరిన ఆహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ.. వైద్య సిబ్బందిపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే.. తాజాగా గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కూడా వీరు రెచ్చిపోయారు. వైద్య సిబ్బంది, నర్స్‌ల ముందు అర్ధనగ్నంగా తిరుగుతూ.. అసభ్యకరమైనా పాటలు పాడుతూ.. మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. గతనెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌కు హాజరైన జమాత్‌ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ సిబ్బందికి సహకరించకపోవడమే కాకుండా.. చికిత్స అందించే వైద్య సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఈ తబ్లిఘి జమాత్‌కు చెందిన సభ్యులు.. అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు పరిసరాల్లో అర్ధనగ్నంగా తిరుగుతూ.. అక్కడి నర్సింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు కలిగేలా అసభ్య ప్రవర్తన చేస్తున్నారని.. ఆస్పత్రి అధికారులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా ఎస్పీ, మేజిస్ట్రేట్‌ల దృష్టికి లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

దీంతో పోలీసులు ఆరుగురు తబ్లిఘి జమాత్ సభ్యులపై.. ఐపీసీ సెక్షన్.. 354,294,509,269,270,271 ప్రకారం కేసులు నమోదు చేశారు. వైద్య సిబ్బందిపై ఏ విధమైన దుష్ప్రవర్తన చేసిన సహించేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?