డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ప్రపంచంతో పాటు మన దేశంలోనూ కరోనా అనే మహమ్మారిపై అందరూ పోరాడుతూనే ఉన్నారు. దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తమ వంతు సహాయం..

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 03, 2020 | 1:30 PM

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ప్రపంచంతో పాటు మన దేశంలోనూ కరోనా అనే మహమ్మారిపై అందరూ పోరాడుతూనే ఉన్నారు. దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు సినీ నటులు. ఈ సందర్భంగా పలువురు నటులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి తమ వంతు సాయం అందిస్తున్నారు. అందులోనూ లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ సమయంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరో మెగాస్టార్ ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

తాజాగా ఈ ఛారిటీకి నట సింహం బాలకృష్ణ రూ.25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే.. ఓ 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, మరో 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్‌కు అందించారు. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.

బాలకృష్ణ కరోనాపై పోరాటంలో భాగంగా చేసి దాతృత్వానికి మెచ్చుకొని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షల విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కష్టసమయంలోనూ, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి:

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

 ఫ్లాష్‌న్యూస్: దేశ వ్యాప్తంగా 2,301కి చేరిన కరోనా కేసులు..

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం