కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి
ఏప్రిల్ 5న దేశ ప్రజలందరూ జాగరణ చేయాలన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం..

కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తోన్న ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. మరోసారి కరోనాకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను గౌరవించారు. చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ప్రతీ ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనన్నారు. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడదామన్నారు.
ఈ సందర్బంగా మరో అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు మోదీ. ఏప్రిల్ 5న దేశ ప్రజలందరూ జాగరణ చేయాలన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్, టార్చ్ వేయాలని దీంతో ఎవరూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎవరూ బయటకు రాకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఈ పని చేయాలని.. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని చెప్పారు.
అలాగే ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే అందరూ సామాజిక దూరం పాటించాలన్నారు. 130 కోట్ల భారతీయులంతా ఏకతాటిపైకి వచ్చి మన దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు. మనం తీసుకున్న మహా సంకల్పంతోనే ఈ మహమ్మారిపై ఘన విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
ఇవి కూడా చదవండి:
చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా
గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్
వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..
విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం
ప్రభాస్ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే