AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Points Table: 29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై ఔట్

IPL 2025 Points Table Updated After MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రయాణంలో సగం ముగిసింది. 38 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, ఇప్పటికే కొన్ని జట్లు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకునే దిశకు చేరుకోగా.. మరికొన్ని టాప్ 4 ప్లేస్‌లో తమ సత్తా చాటుతున్నాయి.

IPL 2025 Points Table: 29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై ఔట్
Mi Vs Csk Ipl 2025
Venkata Chari
|

Updated on: Apr 21, 2025 | 7:38 AM

Share

IPL 2025 Points Table updated after MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రయాణంలో సగం ముగిసింది. ఇప్పటివరకు జరిగిన 38 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి అభిమానుల హృదయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే, ఈ సీజన్‌లో దిగ్గజ టీంలు రాణించడంలో విఫలమయ్యాయి. దీని వలన ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో తలపడగా, సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాల కారణంగా, IPL 2025 పాయింట్ల పట్టిక సమీకరణంలో భారీ మార్పు వచ్చింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం..

ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 37వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది . మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (73), దేవదత్ పడిక్కల్ (61) అర్ధ సెంచరీల సహాయంతో ఆర్‌సీబీ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో (IPL 2025 Points Table) బలమైన ఆధిక్యాన్ని పొందింది.

ఓటమితో ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై ఔట్..

వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ( MI vs CSK ) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఎంఎస్ ధోని నేతృత్వంలోని జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, శివం దూబే అర్ధ సెంచరీల కారణంగా జట్టు ఈ స్కోరు సాధించగలిగింది. దీనికి సమాధానంగా ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్ (68), రోహిత్ శర్మ (76) అర్ధ సెంచరీలతో 15.4 ఓవర్లలో టార్గెట్ చేరుకుంది. దీంతో తొమ్మిది వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

టాప్ 4 ప్లేస్‌లు ఇవే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీని కారణంగా, పంజాబ్ కింగ్స్ నాల్గవ స్థానానికి పడిపోయింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, మ్యాచ్ గెలిచిన తర్వాత ఆరో స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో CSKకి ఇది ఆరో ఓటమి. దీని కారణంగా నికర రన్ రేట్ తగ్గిపోయింది. దీంతో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్ ఐదు విజయాలతో నంబర్ 1 స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ విజయం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఏడో స్థానానికి నెట్టేసింది.

IPL 2025 పాయింట్ల పట్టికను ఇక్కడ చూడండి..

జట్టు ఆడింది గెలిచింది ఓడిపోయినవి నెట్ రన్ రేట్ పాయింట్లు
1. గుజరాత్ టైటాన్స్ 7 5 2 0.984 10
2. ఢిల్లీ క్యాపిటల్స్ 7 5 2 0.589 10
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 5 3 0.472 10
4. పంజాబ్ కింగ్స్ 8 5 3 0.177  10
5. లక్నో సూపర్ జెయింట్స్ 8 5 3 0.088 10
6. ముంబై ఇండియన్స్ 8 4 4 0.483 8
7. కోల్‌కతా నైట్ రైడర్స్ 7 3 3 0.547 6
8. రాజస్థాన్ రాయల్స్ 8 2 6 -0.633 4
9. సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 2 5 -1.217 4
10. చెన్నై సూపర్ కింగ్స్ 8 2 6 -1.392 4

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..