KKR vs GT Preview: నంబర్ 1ను ఢీ కొట్టనున్న నంబర్ 7.. ఓడితే లగేజ్ సర్దేయాల్సిందే
Kolkata Knight Riders vs Gujarat Titans, 39th Match Preview: ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం నాడు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

Kolkata Knight Riders vs Gujarat Titans, 39th Match Preview and Prediction: సోమవారం (ఏప్రిల్ 21), ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 39వ మ్యాచ్‌లో, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుత సీజన్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో కోల్‌కతా 16 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైతే, గుజరాత్ గత మ్యాచ్‌లో ఢిల్లీని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ కోల్‌కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. కానీ, ఇక్కడ కేకేఆర్ (KKR vs GT Preview) తన చివరి మూడు మ్యాచ్‌లలో ఒకదాన్ని మాత్రమే గెలవడం గమనార్హం. రెండింటిలో ఓటమిని చవిచూసింది.
టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తేనే బెటర్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (KKR vs GT) లో ఇప్పటివరకు కోల్‌కతా తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. పరుగులను ఛేదించిన జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచింది. KKR vs RCB మ్యాచ్‌లో, కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగులు చేసింది. RCB ఈజీగా టార్గెట్ ఫినిష్ చేసేసింది.
ఆ తర్వాత, రెండవ మ్యాచ్‌లో, కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసి ఇక్కడ 200 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 120 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో మ్యాచ్‌లో లక్నో ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 238 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా కేకేఆర్ 234 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ప్రస్తుత రికార్డులను పరిశీలిస్తే, టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం సరైనదే కావొచ్చని తెలుస్తోంది.
పవర్ ప్లేలో పరుగుల వర్షం?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ మొదటి 2-3 ఓవర్లు ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యంలో ఉంటుంది. కానీ, బంతి పాతదైతే, ఇక్కడ భారీ స్కోర్‌లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటే, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, పవర్ ప్లేలో 60 నుంచి 65 పరుగులు చేయగలదు. అయితే మొత్తం మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తే 200 నుంచి 210 పరుగులు చేసే ఛాన్స్ ఉంది.
IPLలో KKR vs GT మధ్య గణాంకాలు..
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడుసార్లు ట్రోఫీని గెలుచుకోగలిగింది. అదే సమయంలో, గుజరాత్ తన తొలి సీజన్‌లోనే ట్రోఫీని కైవసం చేసుకోవడంలో విజయం సాధించింది. రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ గణాంకాల ప్రకారం, కోల్‌కతా ఆధిక్యంలో ఉంది. గుజరాత్, కోల్‌కతా మధ్య ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. ఈ కాలంలో కోల్‌కతా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. గుజరాత్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. అదే సమయంలో ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
KKR vs GT మ్యాచ్‌లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది?
KKR vs GT మధ్య జరిగే ఈ మ్యాచ్ విజేత గురించి మాట్లాడితే, గుజరాత్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకపోతోంది. ఈసారి గుజరాత్ జట్టు ఆడుతున్న తీరు చూస్తే, ఏ జట్టునైనా ఓడించడం సాధ్యమే.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
రహమతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అన్రిక్ నోర్ఖియా.
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, ఆర్. సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




