20 April 2025

అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు నిమిషానికి కోటి డిమాండ్

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో నటీనటులుగా ఎదగాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సక్సెస్ అయినవారు ఉన్నారు. 

కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలు, అవమానాలను భరించి.. ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ సర్కిల్లో చక్రం తిప్పుతున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా ఎన్నో కష్టాలు పడిన ఈ అమ్మడు ఇప్పుడు నిమిషానికి కోటి తీసుకుంటుంది. 

ఆమె మరెవరో కాదు హీరోయిన్ నోరా ఫతేహి. కెనడాలో మొరాకో సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన నోరా బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. 

 కెనడాలో పెరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లను ఎదుర్కొన్న నోరా.. ఇండియాకు రాగానే ఆమెకు ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆఫర్స్ రాలేదు. 

కెరీర్ ప్రారంభంలో అనేక కష్టాలు, అవమానాలను ఎదుర్కొంది. అలాగే ఎన్నో సినిమాలకు ఎంపిక చేసి ఆ తర్వాత అనుహ్యంగా తొలగించి మోసం చేశారట.

 కానీ ఇప్పుడు సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది నోరా. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది నోరా. 

2014లో రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్ బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది.