AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రండి పిల్లలూ రండి.. ప్రభుత్వ బడిలో చేరండి ..నేటి నుంచి ఏపీలో స్కూల్ ప్రమోషన్

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉన్నా మంచి విద్యను భోదిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అందించేది అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠాలల మనుగడ కూడా కష్టంగా మారింది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లో స్టూడెంట్స్ కు కల్పించే సదుపాయాలను.. చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాడు. ఏజెన్సీ లో బైక్ కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు.. అంతేకాదు వాట్సాప్ స్టేటస్ లుగా స్కూల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు

Andhra Pradesh: రండి పిల్లలూ రండి.. ప్రభుత్వ బడిలో చేరండి ..నేటి నుంచి ఏపీలో స్కూల్ ప్రమోషన్
Govt. Teacher Campaign
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 21, 2025 | 7:17 AM

Share

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉన్నా మంచి విద్యను భోదిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అందించేది అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠాలల మనుగడ కూడా కష్టంగా మారింది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లో స్టూడెంట్స్ కు కల్పించే సదుపాయాలను.. చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాడు. ఏజెన్సీ లో బైక్ కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు.. అంతేకాదు వాట్సాప్ స్టేటస్ లుగా స్కూల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంగన్వాడిలో చదివిన వారిని ఫస్ట్ క్లాస్ లో చేర్పించటం తో పాటు 5వ తరగతి పూర్తి చేసిన వారు ఆపై తరగతులకు ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమం చేపట్టారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 23 వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. మరో వైపు డిఎస్ సి నోటిఫికేషన్ కూడా విడుదల కావటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ కొరత కూడా తీరే అవకాశం వుంది.

అసలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు చేర్పించాలి..?

ఇపుడు ఇదే పెద్ద చర్చ జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్స్ పల్లెలకు సైతం విస్తరించి, రంగులు హంగులు తో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఒక్క ఎల్ కె జి లో చేరేందుకు లక్ష రూపాయల ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలు వున్నాయి. ఐతే ప్రభుత్వ పాఠశాలలు ఇందుకు భిన్నం ఇక్కడ నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉంటారు. నిరుపేద పిల్లలు ఎక్కువగా ఈ బడుల్లో చదువు కుంటారు. విద్యపై ఆసక్తి వున్నా పిల్లలకు ప్రభుత్వ బడుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఏటా విద్యార్థులకు రూ . 50వేల విలువైన ప్రయోజనాలు ప్రభుత్వ పాఠశాలలలో చదివితే లభిస్తాయి. తల్లికి వందనం, వైద్యపరీక్షలు, బుక్స్, స్కూల్ డ్రెస్ లు ఇలా ఎన్నో ప్రయాజనాలు వున్నాయి. వీటన్నింటిని ప్రచారం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువే టీచర్లు పాంప్లెట్స్ వేసి పంపిణి చేయటం, స్కూల్ ప్రత్యేకతలు తెలియజెప్పేవిధంగా బ్యానర్స్ కట్టడం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బైక్ కి మైక్ కట్టి ప్రచారం

నెలవారీ జీతం అకౌంట్ లో జమ ఐనదా, స్కూల్ కి వెళ్ళామా వచ్చామా అనుకోకుండా ప్రభుత్వ స్కూల్స్ మనుగడ ముఖ్యమని భావించే కొందరు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూడు రమేశా బాబు బడి ప్రచారం చేస్తున్ను ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ద్విచక్రవాహనంపై తిరుగుతూ మైకుతో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాల ఫొటోలు, వివరాలతో ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా బోధన అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ములగలంపల్లి, రౌతుగూడెం, రవీంద్రనగర్, కనకాపురం, పాకలగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us