ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు.. ఈసారి ఇన్వాసిస్ పద్ధతిలో
ప్రస్తుతం కరోనా వైరస్‌తో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ విజృంభిస్తూనే ఉందికానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలకు పైగానే..

ప్రస్తుతం కరోనా వైరస్‌తో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ విజృంభిస్తూనే ఉందికానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలకు పైగానే అయ్యింది. అయినా ఇప్పటికీ ఈ వ్యాధికి మందు దొరకడం లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తుందో తెలీడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా పరీక్షలు చేయించారు. ఇప్పటికే దీని బారిన పడి పలువురు ప్రముఖులు కూడా మృతి చెందారు. పలువురు దేశ ప్రధానులకు కూడా కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో చాపకింద నీరులా ఈ వైరస్ మరింత ప్రబలుతోంది. ఏకంగా అక్కడ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే అది మామూలు విషయం కాదు. దీంతో ట్రంప్ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. మొదటిసారి నెగిటివ్‌గా వచ్చింది. మరలా రెండోసారి ఇన్వాసిస్ పద్దతిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ రిపోర్డుల్లో కూడా కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. నేను మొదటిసారి కరోనా టెస్ట్ చేయించుకున్నప్పుడు.. ఏకంగా 10 గంటల సమయం పట్టింది. కానీ రెండోసారి ఇన్వాసిస్ పద్దతిలో కేవలం 15 నిమిషాల్లో రిజల్ట్ వచ్చిందన్నారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పద్దతి ద్వారా పరీక్ష నిమిషంలోనే పూర్తి అవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది.
ఇవి కూడా చదవండి:
కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి
చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా
గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్
వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..
విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం
ప్రభాస్ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే