ఫ్లాష్‌న్యూస్: దేశ వ్యాప్తంగా 2,301కి చేరిన కరోనా కేసులు..
దేశ వ్యాప్తంగా 2,301కి చేరింది కరోనా పాజిటివ్‌ల సంఖ్య. రోజురోజుకీ ఈ వైరస్ విజృంభిస్తూనే ఉందికానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌తో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలు దాటినా..

దేశ వ్యాప్తంగా 2,301కి చేరింది కరోనా పాజిటివ్‌ల సంఖ్య. రోజురోజుకీ ఈ వైరస్ విజృంభిస్తూనే ఉందికానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌తో అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు దొరకడం లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తుందో తెలీడం లేదు. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అలాగే రాష్ట్రాల వారీగా కూడా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో లిస్ట్ కూడా విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో 356 కరోనా కేసులు నమోదుకాగా, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా 2,301 మందికి కరోనా సోకగా, 157 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారతదేశం మొత్తంగా 56 మంది కరోనా వ్యాధితో మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి:
లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ
కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి
చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా
గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్