Ugadi 2025 Sagittarius Horoscope: ధనస్సు రాశి ఉగాది ఫలితాలు.. ఆర్థికం, కెరీర్ పరంగా ఇలా..
Ugadi 2025 Panchangam Dhanasu Rasi: ధనుస్సు రాశివారికి 2025 ఉగాది ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు, పెళ్లి సంబంధాలు, విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యాలు 1, అవమానాలు 5
ఈ రాశివారికి ఉగాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతున్నప్పటికీ మే 18 నుంచి రాహువు తృతీయ స్థానంలో, మే 25 నుంచి గురువు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఈ ఏడాదంతా అర్ధా ష్టమ శని ప్రభావం బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పనిభారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాబడి పరంగా దూసుకుపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభి స్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. శుభ కార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. అనా రోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాలు పెళ్లిళ్లకు దారితీస్తాయి.
రాశ్యధిపతి గురువు స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏడాది పాటు అర్ధాష్టమ శని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. జూలై తర్వాత ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మరింతగా విజయవంతం అవుతాయి. జీవితం సానుకూల మలుపులు, పరిణామాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయంగా ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. నవంబర్ తర్వాత వీరి జీవితంలో మరికొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సొంతగా వ్యాపారం చేసుకోవడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఎక్కువగా శివార్చన చేయించడం చాలా మంచిది.