Soundarya: నువ్వు వెళ్లాల్సిన టైమొచ్చింది.. సౌందర్యను ముందే హెచ్చరించిన ప్రొడ్యూసర్..
తెలుగు పరిశ్రమలో బెంగుళూరు బ్యూటీలకు కొదువ లేదు. కానీ అందులో దివంగత నటి సౌందర్యది ప్రత్యేక స్థానం. అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉండే సౌందర్య తెలుగు నటి కాదంటే నమ్మశక్యం కాదు. కట్టూబొట్టూతోనే కాకుండా తనదైన నటనతో ఆమె తెలుగు పరిశ్రమపై ఎనలేని ముద్ర వేశారు. ఈ నటి అకాల మరణం ఎందరో సినీ అభిమానులను కలచివేసింది. అయితే, సౌందర్య మరణం ఆమె తండ్రికి ముందే తెలుసునని అంటారు.

పదేళ్ల పాటు తిరుగులేని స్టార్ డం చూసిన సౌందర్య పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి ఆమె భవిష్యత్తును ముందే ఊహించారట. ఈ విషయం ప్రొడ్యూసర్ చిట్టిబాబుతో కూడా పంచుకున్నారట. నువ్వు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నావంటూ చిట్టిబాబు సౌందర్యకు చెప్పారట. ఈ మాటలకు సౌందర్య కూడా షాకయ్యారని కానీ ఇంత పెను ప్రమాదాన్ని ఆమె కూడా ఊహించి ఉండదని తెలిపారు. సౌందర్య తండ్రి కేఎస్ సత్యనారాయణకు తన కుమార్తె అంటే అపారమైన ప్రేమ. ఆమె మరణం గురించి సత్యనారాయణకు ముందే తెలుసని ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు వెల్లడించారు. సౌందర్య సినీ పరిశ్రమలోకి రాకముందే ఆమె జాతకాన్ని జ్యోతిష్యుల వద్ద చూపించిన సత్యనారాయణ, ఆమె సినిమా రంగంలోకి వస్తే అప్రతిహత నాయికగా ఎదుగుతుందని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని తెలుసుకున్నారు. అయితే, ఆమె ఆ రంగంలో కేవలం పదేళ్లు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత పెను ప్రమాదం ఎదురవుతుందని కూడా జ్యోతిష్యులు హెచ్చరించారు.
ఈ విషయాలను సత్యనారాయణ చిట్టిబాబుతో పంచుకున్నారు. అయితే, సౌందర్యకు ప్రమాదం గురించి సూటిగా చెప్పకుండా, పదేళ్ల తర్వాత ఆమె సినీ రంగానికి దూరమవుతుందని పరోక్షంగా సూచించారు. అప్పటికే సౌందర్య వివాహం జరిగినందున, ఆమె కుటుంబ జీవితంలో స్థిరపడుతుందని చిట్టిబాబు భావించారు. కానీ, ఆమె మరణం తర్వాత సత్యనారాయణ మాటల్లోని నిజమైన అర్థం అతనికి అర్థమైంది.
సౌందర్య వివాహం తర్వాత చిట్టిబాబు ఆమెను కలిసినప్పుడు, “నీ తండ్రి చెప్పినవన్నీ నీ జీవితంలో సత్యమవుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు—నీవు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో అన్ని భాషల్లో నటించావు. ఇక మిగిలింది ఒక్కటే—సినీ రంగానికి దూరంగా కుటుంబంతో జీవితం గడపడం,” అని అన్నారు. దీనికి సౌందర్య స్పందిస్తూ, “అంత మాట అన్నారేంటి సార్? నాన్న చెప్పినవన్నీ నిజమయ్యాయి. కానీ ఇదొక్కటి తప్పని నిరూపిస్తాను. చివరి వరకూ సినిమాల్లోనే కొనసాగుతాను,” అని చెప్పింది.
ఆమె చెప్పినట్లుగానే, 1993లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సౌందర్య దాదాపు 100 చిత్రాల్లో నటించి, నటిగా ఉన్నప్పుడే మరణించింది. “పైన తధాస్తు అని దేవతలు ఆశీర్వదించారేమో,” అని చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు