Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్ అందుకుంది.. కట్ చేస్తే ఏడాదిగా..

చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించి.. ఆ తర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తెలుగులో తోపు హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Tollywood : మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్ అందుకుంది.. కట్ చేస్తే ఏడాదిగా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2025 | 11:04 AM

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒక భాషలోనే కాదు రెండు మూడు భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కొంత మంది సొంత ఇండస్ట్రీలో కంటే ఇతర ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్నారు. అలా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే తెలుగులో సినిమాలు చేసిన పరభాషా హీరోయిన్స్ అందరూ సక్సెస్ కాలేదు. అలాంటి వారు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. తెలుగులో చేసిందే మూడు సినిమాలు కానీ ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏడాది పాటు తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందని ఆమె కేరాఫ్ అడ్రస్..

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వయ్యారి భామ మృణాళిని రవి. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న మృణాళిని రవి తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఆ తర్వాత ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు, మామా మశ్చీంద్ర, లవ్‌ గురు తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. ఇక ఈ చిన్నది తెలుగులో గద్దల కొండా గణేష్ సినిమాతో పరిచయామ్ అయ్యింది. ఆతర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే చివరిగా మామా మశ్చీంద్ర సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఈ సినిమా 2023లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ అమ్మడు. తమిళ్ లో రెమో సినిమా చేసింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది.

మృణాళిని రవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.