Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..? దేవరకొండకు జోడిగా స్టార్ బ్యూటీ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..? దేవరకొండకు జోడిగా స్టార్ బ్యూటీ
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2025 | 10:09 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్‌లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నాడు.

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ సినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే రౌడీ జనార్దన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు విజయ్..  యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. రవికిరణ్ కొల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రవికిరణ్ కొల్లా గతంలో “రాజు గారి గది” వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. ఈ సినిమా టైటిల్ “రౌడీ జనార్దన్” అని 2025 మార్చిలో దిల్ రాజు ఓ ప్రెస్ మీట్‌లో అనుకోకుండా వెల్లడించారు. ఆతర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ విజయ్ దేవరకొండ రౌడీ ఇమేజ్‌కు సరిపోతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే ఐదుగురు హీరోయిన్ ను సంప్రదించారని తెలుస్తుంది. విజయ్ కు జోడీగా హీరోయిన్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఆతర్వాత కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే ఆమె కూడా సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు చిత్రయూనిట్ ఆమె ప్లేస్ లో కీర్తిసురేష్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.  కథ స్థానిక రాజకీయ నేపథ్యంలో సాగే అవకాశం తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు చెప్తున్నారు. షూటింగ్ 2025 ఏప్రిల్ లేదా మే నుంచి ప్రారంభం కానుందని దిల్ రాజు వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు