దండం రా దూత..! రోజూ ఫోన్‌లో వాయించేది నువ్వేనా.. నెటిజన్స్ కామెంట్స్ అదుర్స్..
ఈ మధ్య మనం ఫోన్ చేసినప్పుడల్లా.. మనకు ఓ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. .ఇన్ స్టాంట్ లోన్స్ ఇస్తాము..ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి.. అంటూ సైబర్ నేరాల పై అవగాహనా కలిపిస్తూ వినించే వాయిస్ ఎవరిదో తెలుసా.? తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

రీసెంట్ డేస్ లో సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి కేటుగాళ్లు మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. మీ పేరు మీద ఆర్డర్స్ వచ్చాయని, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, లక్కీ డ్రాలో మనీ గెల్చుకున్నారు అంటూ ఫోన్స్ చేసి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఎంతజాగ్రత్తగా ఉన్న కూడా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు మితిమీరుతున్నారు. వీరి నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహనా కలిపిస్తూ.. ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ఫోన్ లోనూ ప్రజలకు జాగ్రత్త చెప్తూ అవగాహనా కలిపిస్తున్నారు. ఫోన్ లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ అవేర్నెస్ ఇస్తున్నారు.
ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా సోషల్ మీడియా లేదా .. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు. అంటూ మోసపోకండి అంటూ మొన్నటి వరకు ఓ లేడీ వాయిస్ వచ్చేది.. ఇప్పుడు జాగ్రత్త..లాటరీ గెలిచారు..ఇన్ స్టాంట్ లోన్స్ ఇస్తాము..ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి..అంటూ మెల్ వాయిస్ తో జాగ్రత్తలు చెపుతున్నారు. అయితే మంచి పనికోసమే చేస్తున్నపటికీ కొంతమంది విసుక్కుంటున్నారు. ఏదైనా ఎమర్జన్సీ కాల్ చేసే సమయంలో ఇలా వాయిస్ రావడంతో కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
కోపం వచ్చిన, చిరాకు వచ్చినా అది మన మంచికోసమే.. అయితే ఫోన్ లో నిత్యం వినిపించే మెల్ వాయిస్ ఎవరిదో తెలుసా..? అతని పేరు శరత్. ఇతను రేడియో జాకీ.. రెగ్యులర్ గా ఎఫ్ ఎమ్ రేడియోలో తన చలాకీ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించాడు. తాజాగా మన ఫోన్ లో రోజు వినిపించే వాయిస్ ఇతనిదే అని గతంలో లేడీ వాయిస్ చేసిన మిర్చి అమృత సోషల్ మీడియాలో రివీల్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దండం రా దూత అని కొందరు.. నువ్వేనా నాయన రోజూ ఫోన్ లో వాయిస్తున్నవ్ .? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.