AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చార్మినార్ దగ్గర ఆ వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ చక్కర్లు.. కుళ్ళుకుంటున్న నెటిజన్స్

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. దాంతో ఆ హీరోయిన్స్ పెళ్లి వార్తలు, రిలేషన్ వార్తలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర చక్కర్లు కొడుతూ కనిపించింది. అది కూడా ఓ వ్యక్తితో దాంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Video: చార్మినార్ దగ్గర ఆ వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ చక్కర్లు.. కుళ్ళుకుంటున్న నెటిజన్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2025 | 11:19 AM

Share

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్, హీరోలు వయసు పెరుగుతున్న పెళ్లి గురించి ఎక్కడ మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. దాంతో హీరోయిన్స్ కు సంబంధించిన పెళ్లి వార్త గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ హీరోయిన్ ప్రేమలో ఉందని.. ఈ హీరోతో పెళ్లి అంటూ ఎదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ గురించి కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. తాజగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఓ వ్యక్తితో కనిపించింది అంతే.. నెటిజన్స్ సోషల్ మీడియాలో గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆమెతో ఉన్నది ఎవరో చూద్దాం.!

తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమా సెకండాండ్రి రాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, తర్వాత ఆమె తమిళ సినిమా పరిశ్రమ వైపు దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి

తమిళంలో “పొక్కిషం”, “కజుగు”, “కెడి బిల్లా కిల్లాడి రంగా” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో “రామ రామ కృష్ణ కృష్ణ”, “పిల్ల జమీందార్” వంటి సినిమాల్లో కూడా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. బిందు మాదవి 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన “బిగ్ బాస్ నాన్-స్టాప్” షో మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది, దీనితో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా బిందు మాదవి చార్మినార్ దగ్గర సందడి చేసింది. ఇందుకు సంబధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తితో కలిసి స్కూటీపై కూర్చొని ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపించింది బిందు మాదవి. దాంతో చాలా మంది బిందు మాధవి ప్రేమలో పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అవి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

బిందు మాధవి ఇన్ స్టా గ్రామ్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్