నిండు గర్భిణికి కరోనా పాజిటివ్
ప్రస్తుతం దేశాన్ని నిజాముద్దీన్ మర్కజ్ భయకంపితులను చేస్తోంది. తాజాగా నిండు గర్భిణికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ప్రధాన కారణమయ్యాయి. దక్షిణ కొరియాలో కరోనా బాధిత మహిళ సృష్టించిన కల్లోలం మాదిరిగానే ప్రస్తుతం దేశాన్ని నిజాముద్దీన్ మర్కజ్ భయకంపితులను చేస్తోంది. తాజాగా నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన డిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే…
ఢిల్లీలోని ఎయిమ్స్ లో పని చేస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. ఆయన ఎయిమ్స్ లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వారి ద్వారా ఆయనకు కరోనా సంక్రమించింది. అయితే ఆయన ద్వారా తొమ్మిది నెలల గర్భిణి అయిన ఆయన భార్యకూ కరోనా సోకినట్లు తెలింది. ముందుగా వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది, దీంతో ఇద్దరికీ వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.