పగబట్టిన కరోనా.. మృతులు 53 వేలు..పాజిటివ్ కేసులు 10 లక్షలు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఈ వైరస్‌కు విరుగుడు మందు లేకపోవడంతో.. ఇది ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఇప్పటికే దీని బారినపడి 53 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 10లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ మనకు తెలీకుండానే శరీరంలోకి ప్రవేశించి.. రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తూ.. దగ్గు, దమ్ము, జలుబు, జర్వం.. ఇలా ఒక్కో రోగానికి గురిచేస్తూ.. పొట్టనబెట్టుకుంటుంది. గత వారం […]

పగబట్టిన కరోనా.. మృతులు 53 వేలు..పాజిటివ్ కేసులు 10 లక్షలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 12:29 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఈ వైరస్‌కు విరుగుడు మందు లేకపోవడంతో.. ఇది ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఇప్పటికే దీని బారినపడి 53 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 10లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ మనకు తెలీకుండానే శరీరంలోకి ప్రవేశించి.. రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తూ.. దగ్గు, దమ్ము, జలుబు, జర్వం.. ఇలా ఒక్కో రోగానికి గురిచేస్తూ.. పొట్టనబెట్టుకుంటుంది.

గత వారం రోజులుగా ఈ వైరస్‌ యూరప్‌, అమెరికా ప్రాంతాల్లో విలయ తాండవం చేస్తోంది. అమెరికాలో గురువారం ఒక్క రోజే 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో 4668 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 760 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అత్యధికంగా ఫ్రాన్స్‌లో గురువారం ఒక్కరోజే 1,355 మంది చనిపోయారు. ఇక స్పెయిన్‌లో 961, యూకేలో 569, బెల్జియంలో 183, జర్మనీలో 176, నెదర్లాండ్స్‌లో 166, ఇరాన్‌లో 124 మంది కరోనా దెబ్బకు ప్రాణాలు విడిచారు. ఇక మనదేశంలో కూడా గత వారం రోజులుగా సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. ప్రస్తుతం రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 50 మందికి పైగా ప్రాణాలు విడిచారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా లెక్కలు ఇవే..

కరోనా పాజిటివ్ కేసులు 1,016,521 మృతులు 53,241 కోలుకున్నవారు 213,141 యాక్టివ్ కేసులు 750,139 క్రిటికల్ కండిషన్‌లో ఉన్నవారు 37,664