AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో భారీ వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్.. దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోనూ దుమ్మురేపుతోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటూ ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది.

OTT Movie: థియేటర్లలో భారీ వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్.. దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
Raju Weds Rambai Movie
Basha Shek
|

Updated on: Dec 31, 2025 | 8:22 PM

Share

సాధారణంగా థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు కొన్ని ఓటీటీలో పెద్దగా ఆడవు. ఎందుకంటే అప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా థియేటర్లలోనూ అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది.కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయితేనేం మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూసేశారు. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 20కోట్లు రాబట్టింది. ఇక ఇటీవలే ఈ లవ్ స్టోరీ ఓటీటీలోకి రాగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దుమ్మురేపుతోంది. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటేయడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ స్టోరీ. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రియలిస్టిక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ పాటికే అర్థమై ఉంటుది మనం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో?యస్.. ఆ సినిమా మరేదో కాదు రాజు వెడ్స్ రాంబాయి.

తెలంగాణకు చెందిన కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. యూత్ స్టార్ సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఈ మూవీలో విలన్ గా క్రూరత్వం పండించాడు. వీరితో పాటు శివాజీ రాజా, అనిత చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 21న విడుదలైన ఈ రియల్ లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక డిసెంబర్ 18 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుందని ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్‌ ఫిల్మ్స్‌, మాన్సూన్‌ టేల్స్‌ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా రాజు వెడ్స్ సినిమానునిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.