Video: అవుట్ అయిన తర్వాత కోపంతో శివాలెత్తిన తెలుగోడు! తిక్కలో ఏకంగా హెల్మెట్ ని..
LSG vs SRH మ్యాచ్‌లో లక్నో అదిరిపోయే విజయాన్ని సాధించింది. SRH 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా, LSG 16.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నితీష్ రెడ్డి అవుట్ అయిన తీరు చర్చనీయాంశమైంది. అవుట్ అయి పెవిలియన్‌కి వెళ్తూ కోపంతో హెల్మెట్ విరిచాడు. గత సీజన్‌లో SRH చేతిలో ఎదురైన అవమానానికి ప్రతీకారంగా LSG ఈ విజయాన్ని అందుకుంది.

IPL 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో గత సీజన్‌లో ఎదుర్కొన్న అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో SRH తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది మంచి స్కోర్‌గా కనిపించినప్పటికీ, LSG బ్యాటింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకుని, సునాశయంగా మ్యాచ్ ను గెలిచింది.
SRH ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్-నితీష్ రెడ్డి మధ్య ఒక మంచి భాగస్వామ్యం నెలకొన్నప్పటికీ, ఇద్దరూ తమ తొలి స్టార్ట్‌ను భారీ స్కోర్‌లుగా మార్చలేకపోయారు. ఈ మ్యాచ్‌లో SRH టాప్-ఆర్డర్ కుదేలవ్వడం వల్ల, జట్టు భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన కనబరిచారు, ముఖ్యంగా శార్దూల్ , రవి బిష్ణోయ్‌లు కీలక వికెట్లు తీసుకున్నారు.
SRH బ్యాటింగ్ విఫలమైన నేపథ్యంలో, నితీష్ రెడ్డి తన అవుట్ ను అంగీకరించలేకపోయాడు. అవుట్ అయిన వెంటనే కోపంతో పెవిలియన్‌కి వెళ్లిపోతూ మెట్లపై తన హెల్మెట్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ నిప్పులా వ్యాపిస్తోంది. రెడ్డి తన నిరాశను బయటపెట్టే విధానం అభిమానుల్లో వివిధ ప్రతిస్పందనలకు దారి తీసింది.
నితీష్ రెడ్డి IPL 2024లో “ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును గెలుచుకున్నాడు. కొత్త సీజన్ అయిన IPL 2025లో కూడా అతను మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే, ఆరంభాన్ని నిలబెట్టుకొని పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో మాత్రం విఫలమయ్యాడు. అతని ఆటతీరు SRH విజయావకాశాలకు కీలకం కానుంది.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ అనుభూతిని అందించింది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో LSG SRHపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SRH 190 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, LSG 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నమెంట్‌లో తమ తొలి గెలుపును నమోదు చేసింది.
IPL 2025లో SRHపై ఈ విజయం LSGకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే గత ఏడాది జరిగిన IPL 2024లో SRH 9.4 ఓవర్లలోనే 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి LSGను తీవ్రంగా అవమానించింది. ఆ మ్యాచ్ అనంతరం LSG యజమాని సంజీవ్ గోయెంకా, అప్పటి కెప్టెన్ KL రాహుల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బహిరంగంగా మైదానంలోనే అతనిని దూషించాడు. ఈ సంఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
nitish kumar reddy throwing helmet 😂#SRHvLSGpic.twitter.com/sS0UJhApPb
— 🐐 (@itshitmanera) March 27, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..