Covishield: ‘కొవిషీల్డ్’ ను వారికి ఇవ్వొద్దు.. కీలక సూచనలు చేసిన జర్మన్ వ్యాక్సిన్ కమిషన్..
Covishield: కోవిడ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ వినియోగంపై జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

Covishield: కోవిడ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ వినియోగంపై జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 65 ఏళ్లు దాటిన వారెవరికీ ‘కొవిషీల్డ్’ టీకాను ఇవ్వొద్దని సూచించింది. వయసు పైబడిన వారికి టీకా ఇవ్వడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు రావొచ్చునని అభిప్రాయపడింది జర్మనీ వ్యాక్సిన్ కమిషన్. తమ ఆందోళనకు కారణం కూడా ఉందంటోంది. 65 ఏళ్ల పైబడిన వారిపై టీకా ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సమాచారం లేనందున.. 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వారికి మాత్రమే టీకా ఇవ్వడం క్షేమకరం అని అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకని.. 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు గల వారికి ‘కొవిషీల్డ్’ టీకా ఇవ్వొచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ టీకాను భారత్ సహా దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలోనూ వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
Also read:
High Alert: ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఐఎస్ఎఫ్.. దేశవ్యాప్తంగా ఉన్న..
మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?