ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా ఉధృతి.. ఒక్క రోజు ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..
Corona Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కరోనా కేసులతో పాటు మరణాలు...

Corona Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 2,216,421 దాటింది. నిన్న ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా 5,89,158 పాజిటివ్ కేసులు, 14,996 మరణాలు సంభవించాయి. ఇక కరోనా కారణంగా బ్రిటన్, జర్మనీ, హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.
భారత్ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా తీవ్రత తగ్గలేదు. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102,636,333 నమోదు కాగా.. రికవరీ కేసులు 74,329,586 చేరుకున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటిదాకా అక్కడ 26,512,193 కరోనా కేసులు నమోదు కాగా,, 447,459 మరణాలు సంభవించాయి. ఇక ఇండియాలో 10,734,026 పాజిటివ్ కేసులు, 154,184 మరణాలు సంభవించాయి.