Novavax Vaccine: అమెరికా నోవావాక్స్ వ్యాక్సిన్‌పై మరో గుడ్ న్యూస్.. ప్రభావ శీలత ఆధారంగా భారత్‌కు వచ్చే ఛాన్స్

ప్రపంచంలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన దేశాల్లో ఒకటైన అమెరికా రూపొందించిన నోవావాక్స్‌పై మరో శుభవార్త తాజాగా వెల్లడైంది. నోవావాక్స్ కరోనా మహమ్మారిపై అత్యంత..

Novavax Vaccine: అమెరికా నోవావాక్స్ వ్యాక్సిన్‌పై మరో గుడ్ న్యూస్.. ప్రభావ శీలత ఆధారంగా భారత్‌కు వచ్చే ఛాన్స్
17
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 12, 2021 | 6:41 PM

American Novavax Vaccine gets clear nod: కరోనాపై పోరాటంలో మానవాళి పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారిని నిరోధించడానికి, నిర్మూలించడానికి అనేక వ్యాక్సిన్లు రాగా.. వాగా ప్రభావ శీలత కూడా రోజురోజుకూ మెరుగుపడుతోంది. మన దేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ప్రభావ శీలత మెరుగ్గా వుండడంతో దానికి ఫ్రీ యూసేజ్‌కు కేంద్రం అనుమతివ్వబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ఈ వ్యాక్సిన్ కరోనా నియంత్రణలో అత్యంత మెరుగ్గా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది రకాల కరోనా వ్యాక్సిన్లు వినియోగంలోకి వచ్చాయి. ప్రపంచంలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన దేశాల్లో ఒకటైన అమెరికా రూపొందించిన నోవావాక్స్‌పై మరో శుభవార్త తాజాగా వెల్లడైంది. నోవావాక్స్ కరోనా మహమ్మారిపై అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 96.4 శాతం సమర్థత చూపించినట్లు ప్రయోగ ఫలితాల్లో నిరూపణ అయ్యింది. అంతేకాకుండా కేవలం ఒక్క డోసు తీసుకున్న కొన్ని వారాల్లోనే 83.4శాతం ప్రభావశీలత చూపించినట్లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ‘నోవావాక్స్’ సంస్థ‌ వెల్లడించింది.

నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ ఫైనల్ స్టేజీ ఎక్స్‌పెరిమెంట్లలో భాగంగా, బ్రిటన్‌లో పదిహేను వేల మందిపైనా, దక్షిణాఫ్రికాలో నాలుగున్నర వేల మంది వాలంటీర్లపై నోవావాక్స్‌ ప్రయోగాలు చేసింది. దక్షిణాఫ్రికాలో దాదాపు 245 మంది ఎయిడ్స్‌ రోగులపైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపట్టింది. ప్రయోగాల్లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 106 మంది కరోనా వైరస్ బారినపడగా, వీరిలో పది మంది మాత్రమే వ్యాక్సిన్‌ గ్రూపునకు చెందినవారు. మిగిలిన వారంతా ప్రయోగాల్లో ప్లెసిబో టీకాను పొందిన వారేనని నోవావాక్స్‌ తెలిపింది. ఇలా ఒరిజినల్‌ స్ట్రెయిన్‌పై 96.4 శాతం ప్రభావం చూపించగా, ఈ మధ్యే వెలుగుచూసిన కొత్త రకం యూకే వైరస్‌లపై 86.3 శాతం సమర్థత చూపించిందని నోవావాక్స్‌ పేర్కొంది. బ్రిటన్‌లో జరిపిన ప్రయోగాల్లో మొత్తమ్మీద 89.7 శాతం ప్రభావ శీలత చూపించిందని, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ (మ్యూటేషన్ అయిన స్ట్రెయిన్ వైరస్)పై మాత్రం 55.4శాతం ప్రభావం చూపించినట్లు వెల్లడైంది. అయినా కొత్తరకం వైరస్‌లపై ఇది సమర్థవంతంగానే పనిచేస్తుందని నోవావాక్స్‌ ప్రకటించింది. తాజా ఫలితాలతో వివిధ దేశాల్లో అనుమతికి నోవావాక్స్‌ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

నోవావాక్స్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రభావశీలత ఫలితాలు భారత్‌కు కలిసివచ్చే విషయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఆ సంస్థ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. ఇందులోభాగంగా కొవావాక్స్‌ పేరుతో దాదాపు వంద కోట్ల డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికాలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా, భారత్‌లో రెండు వ్యాక్సిన్‌ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో కోవాగ్జిన్ ప్రభావ శీలతపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ALSO READ: ఈసారి కరోనా మరింత డేంజరస్! వీర్యకణాలపై కరోనా ప్రభావం?

ALSO READ: సరిహద్దులో తోకముడిచిన డ్రాగన్.. కొత్త వివాదాలకు డ్రాగన్ యత్నం..

ALSO READ: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్

ALSO READ: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్