Covid Second Wave: ఈసారి కరోనా మరింత డేంజరస్! వీర్యకణాలపై కరోనా ప్రభావం?

ముంబయి నగరంతోపాటు పుణె, నాగ్‌పూర్ నగరాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌పై వెల్లడైన ఓ నివేదిక షాకింగ్ విషయాన్ని బహిర్గతం చేసింది.

Covid Second Wave: ఈసారి కరోనా మరింత డేంజరస్! వీర్యకణాలపై కరోనా ప్రభావం?
16
Follow us

|

Updated on: Mar 12, 2021 | 6:08 PM

Covid-19 second wave effect alarming: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ఇపుడు యావత్ దేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. గడిచిన 24 గంటల్లో (మార్చి 11 ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 9 గంటల వరకు) దేశంలో 23 వేలకు పైగా కేసులు నమోదైతే అందులో ఒక్క మహారాష్ట్రలోనే 14 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులునమోదయ్యాయి. ముంబయి నగరంతోపాటు పుణె, నాగ్‌పూర్ నగరాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌పై వెల్లడైన ఓ నివేదిక షాకింగ్ విషయాన్ని బహిర్గతం చేసింది.

కరోనాతో పురుషుల్లో వీర్యకణాల శాతం గణనీయంగా తగ్గుతోందన్నది తాజా అధ్యయనంలో తేలింది. అసలు కణాల్లో చురుకుదనం ఉండటం లేదని గుర్తించారు. ఫలితంగా సంతానలేమి సమస్యకు దారి తీస్తోంది. కరోనా భయంతో ఎక్కువగా ఇంట్లో గడపడటంతో సంతానం శాతం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన ప్రతీ పది మందిలో ఒకరిద్దరికి ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ సమస్య వచ్చింది. అందుకే కరోనా తగ్గాక కొన్ని నెలల పాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

దేశంలో కరోనా మళ్ళీ విజ‌ృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతోంది. మార్చి 11-12 మధ్య 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు రికార్డయ్యాయి. 117 మంది మత్యువాత పడ్డారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 13 లక్షల 8 వేల 856. కాగా ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 97 వేల 237. ఒక కోటి 9 లక్షల 53 వేల 303 మంది కరోనా సోకి, కోలుకుని బయటపడ్డారు. కాగా దేశంలో మ‌ృతుల సంఖ్య లక్షా 58 వేల 306కు చేరుకుంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మళ్ళీ లాక్‌డౌన్ విధించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండు కోట్ల 60 లక్షల 73 వేల 517 మంది.

తాజాగా వెల్లడైన నివేదికను అనుసరించి.. కరోనా సోకి కోలుకున్న వారు కొన్ని నెలల పాటు సంతానం కోసం ప్రయత్నం చేయొద్దని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. వీర్య కణాల శాతం తగ్గడం, చురుకుగా లేకపోవడంతో కన్సీవ్ అయినా.. గర్భస్రావాలు అవుతాయని, దాని వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వైరస్‌ వల్ల సంతాన సాఫల్యతపై ప్రభావం పడుతుందంటున్నారు. కరోనా సోకి కోలుకున్నవారిలో కొందరిలో అయితే స్పెర్మ్ కౌంట్ జీరోగా వుంటుందని అంటున్నాయి వైద్య వర్గాలు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌, లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో వీర్యం నాణ్యత బాగా తగ్గిందన్న అంశాన్ని వైద్యులు గుర్తించారు.

వీర్యంపై కరోనా ప్రభావం గురించి ఏడాది కాలంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనాతో మరణించిన ఆరుగురి, కరోనా నుంచి కోలుకున్న 23 మంది వృషణాలు, ఎపిడిడైమిసన్ పరిశీలించారు. వీర్యాన్ని వృషణాల నుంచి రవాణా చేసే నాళాలను పరీక్షించారు. ఆయా ఫలితాలను ఆరోగ్యవంతులైన, అదే వయసు పురుషుల వీర్యం నాణ్యతతో పోల్చి చూశారు. కరోనాతో మరణించినవారి నుంచి సేకరించిన నమూనాల్లో తేడాలను గమనించారు. వారి కణాలు, ప్రొటీన్లు వాపునకు గురవడాన్ని గుర్తించారు వైద్యులు. కొందరి వృషణాల్లో రక్తాన్ని గుర్తించారు. వైరస్‌ బారిన పడి కోలుకున్న వారిలో 39 శాతం మందిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోయినట్లు ఐడెంటిఫై చేశారు. మరి కొందరిలో వీర్యంలో తెల్ల రక్త కణాలు కనిపించాయంటున్నారు. జికా వైరస్‌ వల్ల ఎలుకల్లో సంతాన సాఫల్యత తగ్గినట్లు గతంలో పరిశోధనల్లో తేలింది. హెచ్‌ఐవీ, మంప్స్‌, హెపటైటిస్‌ బి, సి, ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌పీవీ, ఎబోలా, ఈబీవీ, హెచ్‌ఎఎస్వీ వైరస్ వల్ల పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గినట్లు గత పరిశోధనలు తేల్చాయి. తాజాగా కరోనా వైరస్‌ వల్ల వృషణాల్లో వాపు వస్తోందంటున్నారు. వైరస్‌ బారిన పడి కోలుకున్నవారు కొంతకాలం ఆగి పిల్లల కోసం ప్రయత్నిస్తే మేలన్న వైద్యులు సూచిస్తున్నారు. కనీసం 2,3 నెలల ఆగాలని అంటున్నారు.

అయితే కరోనా ప్రభావం మహిళల్లో మరోలా వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా ప్రభావం మహిళల్లో అండాశయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని పరిశోధనల్లో తేలింది. అయితే వీర్య కణాలు వీక్ అవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల మహిళలు తమకెలాంటి సమస్యలు లేకపోయినా గర్భం దాల్చవద్దని వైద్యులంటున్నారు. కరోనా సోకిన మగవారిలో 3,4 నెలల తర్వాత వీర్యం కౌంట్ నార్మల్ దశకు వచ్చేస్తుందంటున్నారు. అందువల్ల స్పెర్మ్ కౌంట్ టెస్టు చేయించుకోవాలని, 30 – 40 శాతం వీర్య కణాల కదలికలు చురుకుగా వుంటేనే సంతానం కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్‌లో 15 మిలియన్లకు పైగా శుక్ర కణాలు ఉంటేనే పిల్లలు పుట్టే అవకాశం వుంటుంది. అంత కంటే తక్కువగా ఉంటే పిల్లలు పుట్టడం కష్టసాధ్యమవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకునే వీలుంది. వృషణాలు వేడెక్కడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత కంటే వృషణాల వద్ద వేడి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందు కోసమే వృషణాలు శరీరం నుంచి కాస్త దూరంగా ఉంటాయి. కానీ బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల వీర్య కణాలపై ప్రభావం పడుతుంది. పూర్తి సామర్థ్యం మేరకు వీర్య కణాలు ఉత్పత్తి చేయలేవంటున్నారు అండ్రాలజిస్టులు. నిద్రకు ఉపక్రమించే ముందు అండర్‌వేర్ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు పొడవుగా, బిగుతుగా ఉండే ప్యాంట్లు వద్దని, వదులుగా, చిన్నగా ఉండే షార్ట్స్ ధరించడం మంచిదంటున్నారు నిపుణులు. మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదని, ఆటలు ఆడేటప్పుడు వృషణాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలని సూచిస్తున్నారు. హెర్బ‌ల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుందని, ఫలితంగా ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. ఒత్తిడి వల్ల సెక్స్ సామర్థ్యం దెబ్బతినడంతోపాటు వీర్య ఉత్పత్తి కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు 12 గంటలపైగా పనిచేసేవారికి విశ్రాంతి తక్కువగా లభిస్తుంది.. అలాంటి వారు రిలాక్సేషన్ టెక్నిక్‌లను పాటించాలని, యోగా, మెడిటేషన్ చేయాలని చెబుతున్నారు. లేదంటే రన్నింగ్, స్విమ్మింగ్ చేయడం వల్ల ఫలితం వుంటుందని అంటున్నారు. ఒత్తిడితో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు వీర్య ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుందని అందువల్ల ఒత్తిడికి దూరంగా ఉండాలని అండ్రాలజిస్టులు. కరోనా సోకడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తి వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని చెబుతున్నారు. పొగ తాగే అలవాటు ఉన్నవారు మానుకోవాలని, సిగరెట్ తాగని వారితో పోలిస్తే.. తాగే వారిలో 22 శాతం మందిలో వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారిలో కాలేయం పని తీరు మందగిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనేవారు లేదా వీర్యస్ఖలనం చేసేవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు గుర్తించారు. రోజులో మిలియన్ల సంఖ్యలో వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ సార్లు స్ఖలనం అవ్వడం వల్ల వాటి కణాల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. తక్కువ సార్లు స్ఖలనం అయ్యేలా చూసుకోవాలని, రోజుకు రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనే బదులు గ్యాప్ తీసుకోవాలని అంటున్నారు. కెమికల్స్, టాక్సిన్ల కారణంగానూ వీర్యం పరిమాణం, కదలికలో మార్పులు వస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలంటున్నారు. కొన్ని రకాల మందులు వీర్యం ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపి, వ్యంధత్వానికి కూడా దారి తీసే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ALSO READ: సరిహద్దులో తోకముడిచిన డ్రాగన్.. కొత్త వివాదాలకు డ్రాగన్ యత్నం..

ALSO READ: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్

ALSO READ: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్