UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..
Upsc Jobs
Follow us

|

Updated on: Aug 27, 2022 | 9:31 PM

UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (04), డిప్యూటీ డైరెక్టర్ జనరల్/ రీజినల్ డైరెక్టర్ (03), రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌ (04), సైంటిస్ట్-బి (07), ఆంత్రోపాలజిస్ట్ (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట రాత పరీక్ష ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 15-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles