TSPSC: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నొటిఫికేషన్.. పూర్తి వివరాలు..
TSPSC: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రూప్1, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్‌పీఎస్‌సీ మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది....
TSPSC: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రూప్1, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్‌పీఎస్‌సీ మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీల భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే మహిళలు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 08-09-2022న ప్రారంభమై 29-09-2022తో ముగియనుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..