TS CETs 2022: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఐతే ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీకలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

TS CETs 2022: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఐతే ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
Ts Cets 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2022 | 7:26 AM

Telangana releases Common Entrance Test 2022 schedule:తెలంగాణలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి (TSCHE) మంగళవారం (మార్చి 39) ప్రకటించింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌ (TS ICET 2022), టీఎస్‌ పీజీఎల్‌సెట్‌, టీఎస్‌ ఈడీసెట్‌, టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ప్రకటించారు. కాగా ఈ ప్రవేశ పరీక్షలన్నీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగనున్నాయి.

తెలంగాణ సెట్స్‌ తేదీలివే

  • టీఎస్‌ లాసెట్‌ (3 ఏళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్‌) పరీక్ష తేదీ జులై 21, 2022.
  • టీఎస్‌ లాసెట్‌ (5 ఏళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్‌) పరీక్ష తేదీ జులై 22, 2022.
  • టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ (ఎల్ఎల్‌ఎమ్‌ కోర్స్‌) పరీక్ష తేదీ జులై 22, 2022.
  • టీఎస్‌ ఈడీసెట్‌ (బీఈడీ కోర్సులో ప్రవేశాలు) పరీక్ష తేదీ జులై 26, 27, 2022.
  • టీఎస్‌ ఐసెట్‌ (ఎమ్‌బీఏ, ఎమ్‌సీఏ కోర్సుల్లో ప్రవేశాలు) పరీక్ష తేదీ జులై 27, 28, 2022.
  • టీఎస్‌ పీజీఈసెట్‌ (ఎమ్‌టెక్‌, ఎమ్‌ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు) పరీక్ష తేదీ జులై 29 నుంచి ఆగస్ట్‌ 1 వరకు

ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్, టెన్త్‌ పరీక్షల షెడ్యూళ్లలో తెలంగాణ విద్యాశాఖ మార్పులు చేర్పులు చేసి కొత్త తేదీలను కూడా ప్రకటించింది. ఇక ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షల తర్వాతే తెలంగాణ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత జులైలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంసెట్ 2022 నోటిపికేషన్‌ను ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు కొనసాగుతుంది. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రకల్చర్ ప్రవేశ పరీక్షలు, జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం105 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. దీనితో పాటు ఈసెట్-2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. జూలై 13న ఈసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంసెట్ ప్రవేశ పరీక్షల కోసం ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశమైంది. ఎంసెట్‌ పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకలు వెల్లడించాలని నిర్ణయించారు. నిజానికి గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ ఈ దఫా ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్‌కు ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్ధులను ప్రమోట్‌ చేయడంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జులైలోనే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐతే తెలంగాణ కంటే ఏపీలో ముందుగా ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11న విడుదలకానుంది.

Also Read:

ICAI CA May 2022 admit card: సీఏ 2022 మే సెషన్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..