NABARD Internship Scheme: విద్యార్థులకు NABARD ఆఫర్.. నెలకు 18 వేల స్టైఫండ్.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!

NABARD Internship Scheme: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2022-23 కోసం

NABARD Internship Scheme: విద్యార్థులకు NABARD ఆఫర్.. నెలకు 18 వేల స్టైఫండ్.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!
Nabard
Follow us

|

Updated on: Mar 30, 2022 | 6:30 AM

NABARD Internship Scheme: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2022-23 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 40 సీట్లు ఖాళీ ఉండగా.. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమవగా.. చివరి తేదీ మార్చి 31గా ప్రకటించారు. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు NABARDకి సంబంధించిన అంశాలైన.. పనులు/ప్రాజెక్ట్‌లు/అధ్యయనాలను కేటాయించడం జరుగుతుంది. అంటే.. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులు (i) రైతు ఉత్పత్తిదారుల సంస్థలు/ఫార్మర్ కలెక్టివ్‌లు (ii) గ్రామీణ సంఘం సంస్థలైన SHGలు/JLGలు (iii) వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యయనాల ద్వారా సంబంధిత విభాగాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవచ్చు అనేది నాబార్ద్ లక్ష్యం.

40 ఖాళీలు.. ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్‌లో భాగంగా 40 మంది ఖాళీలకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతీయ కార్యాలయాలు/టీఈ పరిధిలో 35, ప్రధాన కార్యాలయం పరిధిలో 5 సీట్లు ఉన్నాయి. నోటిఫికేషన్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు(https://www.nabard.org/whats-new.aspx)లో పేర్కొనడం జరిగింది.

అర్హత: దరఖాస్తుదారులు వ్యవసాయం లేదా అనుబంధ విభాగాలు (వెటర్నరీ, ఫిషరీస్, మొదలైనవి), అగ్రి-బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా చదువుతున్న వారు అర్హులు. ఇక పేరుపొందిన విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.

ఒక నిర్దిష్ట రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో డిగ్రీని అభ్యసిస్తూ ఉండాలి లేదా వారు ఆ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. ఇక ప్రధాన కార్యాలయానికి కేటాయించిన సీట్ల కోసం, ముంబై నుండి విద్యను అభ్యసించే ముంబై విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే, ముంబైలోని హెడ్ ఆఫీస్‌లోని సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనిష్టంగా 8 వారాలు. గరిష్టంగా 12 వారాలు ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులు 15 ఏప్రిల్ 2022 నుంచి 31 ఆగస్టు 2022 మధ్య ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 స్లైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు ఫీల్డ్ విజిట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇతర ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారు. కాగా, ఎంపిక చేసుకున్న అంశం/ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన విద్యార్థులకు స్టైఫండ్, ఫీల్డ్ అలవెన్స్, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే.. నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.nabard.org/whats-new.aspxను సందర్శించవచ్చు. దరఖాస్తులు కూడా ఈ వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవచ్చు.

Also read:

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..