UGC NET JRF 2022: గుడ్‌న్యూస్! యూజీసీ నెట్‌ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డ్ లెటర్ వ్యాలిడిటీ మరో ఏడాది పొడిగింపు..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అవార్డ్ లెటర్ వ్యాలిడిటీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు మార్చి 28న ప్రకటన విడుదల చేసింది..

UGC NET JRF 2022: గుడ్‌న్యూస్! యూజీసీ నెట్‌ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డ్ లెటర్ వ్యాలిడిటీ మరో ఏడాది పొడిగింపు..
Ugc
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2022 | 7:49 AM

UGC NET JRF 2022 validity extended: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అవార్డ్ లెటర్ వ్యాలిడిటీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు మార్చి 28న ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా యూజీసీ నెట్‌ అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ జేఆర్‌ఎఫ్‌ చెల్లుబాటు కాల వ్యవధిని మరో ఏడాదిపాటు (సాధారణంగా 3 ఏళ్లు ఉంటుంది) పొడిగిస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డిసెంబర్ 2020, జూన్ 2021 సెషన్లకు సంబంధించిన యూజీసీ నెట్ పరీక్షలను నవంబర్ 20, 2021, జనవరి 5, 2022 తేదీల్లో నిర్వహించింది. ఇక ఈ పరీక్షలకు దాదాపు12 లక్షలకు పైగా నమోదు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 239 నగరాల్లో.. 837 కేంద్రాలలో.. 81 సబ్జెక్టులలో జరిగాయి.

Also Read:

TS CETs 2022: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఐతే ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..