ఏప్రిల్ 11న విడుదలకానున్న AP EAPCET 2022 నోటిఫికేషన్.. పూర్తివివరాలివే!
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 పరీక్షలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 11న విడుదలకానున్నట్లు..
AP EAPCET 2022 Schedule: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 4 నుంచి 8 వరకు మొత్తం 5 రోజుల పాటు, మొత్తం 10 సెషన్లలో ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 11న విడుదలకానుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ తెల్పింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏపీ ఉన్నత విద్యా మండలి (APSCHE) తరపున ప్రతీ యేట జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఏపీఈఏపీ సెట్ 2022ను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ తెల్పింది. జాతీయ ప్రవేశ పరీక్షలకు (JEE 2022, NEET 2022) అనుగుణంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే రీషెడ్యూల్ చేసి విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షలను గతంలో 136 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించేవారు. ఐతే ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: