Telangana SSC Results 2025: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు వచ్చేది అప్పుడేనట..
పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి.. టెన్త్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. అందుకే.. పదో తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంటుంది.. కాగా.. తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి.

పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి.. టెన్త్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. అందుకే.. పదో తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంటుంది.. కాగా.. తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 (బుధవారం)తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది.. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు ముూల్యాంకనం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7 నుండి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది. దీని తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి.. మూల్యాంకనం పూర్తవ్వడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే.. పరీక్ష ముగిసిన ఒక నెలలోపు ఫలితాలను వెల్లడించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, టెన్త్ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.telangana.gov.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తుంది. ఎక్స్‌టర్నల్ పరీక్షలకు 80 మార్కులు, ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు కేటాయించారు.
ప్రస్తుతం.. ఓరియంటల్ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయని.. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.